Telugu News

పొలాల్లోకి దూసుకెళ్లిన సూపర్ లగ్జరి బస్సు

తప్పిన పెను ప్రమాదం

0

పొలాల్లోకి దూసుకెళ్లిన సూపర్ లగ్జరి బస్సు

— తప్పిన పెను ప్రమాదం

(ఖమ్మం రూరల్-విజయంన్యూస్)

ఆర్టీసీ కి చెందిన సూపర్ లగ్జరరీ బస్సు అదుపు తప్పి పోలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ కొంత జాగ్రత్త పడటంతో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన బుధవారం ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు వద్ద చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే భ్రదాచలం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరరీ బస్సు బుధవారం తెల్లవారుజామున భద్రాచలం నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. ఖమ్మం నూతన ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చిన బస్సు అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరింది. మొత్తం బస్సులో 35మంది ప్రయాణికులు హైదరాబాద్  కు వెళ్తున్నారు. అయితే మార్గం మధ్యలోని తల్లంపాడు వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న ఓ ఆటోను ఓవర్ టేక్ చేయబోయి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

డ్రైవర్ కొంత అప్రమత్తం కావడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. ఏఒక్క ప్రయాణికునికి గాయాలు కాలేదు.ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

also read : నడిరోడ్డుపై వెలిసిన ఎండిన మొక్క