Telugu News

ఆర్టీసీ కార్గో సూపర్ సక్సెస్ :మంత్రి పువ్వాడ

రెండేళ్లలో రూ.120.52 కోట్ల కార్గో, పార్సిల్ ఆదాయం

0

ఆర్టీసీ కార్గో సూపర్ సక్సెస్ :మంత్రి పువ్వాడ

★ ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలు అద్భుతం

★ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

★ రెండేళ్లలో రూ.120.52 కోట్ల
కార్గో, పార్సిల్ ఆదాయం

★ వినియోగదారుల అవసరాలకు
అనుగుణంగా సేవలు విస్తరణ

ఖమ్మం ప్రతినిధి, జూన్ 149(విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గో పార్సిల్ సర్వీస్ సూపర్ సక్సెస్ అయ్యిందని,  రెండేళ్ళుగా కార్గో పార్సిల్ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి రెండేళ్లు కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా వినియోగదారులకు మంత్రి అజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి కరోనా వైరస్ ఉదృతి కారణంగా మరింత నష్టపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనల మేరకు ఇతర మార్గాలను అన్వేషించి పార్సిల్‌, కొరియర్‌, కార్గో సేవలను జూన్ 19,2020న ప్రారంబించామని వెల్లడించారు.

Allso read:- ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగరేద్దాం: మంత్రి

పార్సిల్ సర్వీసులతో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు వెళ్లే అన్ని ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి వచ్చాయని గతంలో ఆర్టీసీ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పార్సిల్‌- కొరియర్‌ సేవలను నిర్వహించేది కానీ ప్రస్తుతం ఆర్టీసీ సొంతంగా పార్సిల్‌- కొరియర్‌ సేవలు అందిస్తుందని మంత్రి చెప్పారు.

తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవల ద్వారా రెండేళ్లలో రూ.120.52 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని ఇప్పటి వరకు పార్సిళ్ల బట్వాడా ద్వారా రూ.88.68 కోట్లు, కార్గో రవాణా ద్వారా రూ.31.84 కోట్ల ఆదాయం సమకూరిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.

Allso read:- షర్మిల..దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు : మంత్రి పువ్వాడ

వివిధ రకాల కార్గో సేవలు ఆర్టీసీ ప్రత్యేకంగా కొనసాగిస్తూ ఇంటింటికీ సైతం సేవలను ప్రారంభించిందని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కార్గో సేవలు ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటక, మహారాష్ట్రల్లోని నగరాలకూ విస్తరించామని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.