Telugu News

అయ్యప్పస్వామి భక్తులకు ఆర్టీసీ శుభవార్త

రాయితీలను ప్రకటించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

అయ్యప్పస్వామి భక్తులకు ఆర్టీసీ శుభవార్త

== రాయితీలను ప్రకటించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== శబరిమల యాత్రకు ఆర్టీసి ప్రత్యేక అద్దె బస్సులు

== అయ్యప్ప స్వామి భక్తులకు రాయితీపై ఆర్టిసి ప్రత్యేక బస్సులు.

== అయ్యప్ప భక్తులారా టిఎస్ ఆర్టిసి కల్పిస్తున్న అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి..

== ఏలాంటి డిపాజిట్లు లేకుండా  అయ్యప్ప స్వామి దర్శనం

== ఆర్టీసి బస్సుల కోసం మీ దగ్గరలోని సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించండి.

==  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

శబరిమలై వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు టిఎస్ ఆర్టీసి సంస్థ  శుభవార్త తెలిపింది.  పవిత్ర కార్తీక మాసం కావడంతో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి భక్తులకు రాష్ట్ర రవాణాశాఖ, తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన ఆపర్ ప్రకటించింది. ఎలాంటి డిపాజిట్లు లేకుండా ఆర్టీసీ బస్సుల్లోప్రయాణించే అవకాశాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ రాయితీతో బస్సులను టిఎస్ఆర్టీసి సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

allso read- తెలంగాణ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్రను సురక్షితంగా వెళ్లి రావడానికి అనువుగా టిఎస్ ఆర్టిసి సంస్థ భక్తుల కోసం కొంత రాయితీపై ప్రత్యేక టిఎస్ఆర్టిసి బస్సులను సమకూరుస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. టిఎస్ఆర్టీసి సంస్థ బస్సులలో అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదనపు సీట్ల కోసం ఇద్దరు గురుస్వాములు, 02 వంట మనుషులు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ను ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు.శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితం.. టిఎస్ ఆర్టిసి వారి ప్రత్యేక బస్సులలో ఆడియో మరియు వీడియో తోపాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఈ యొక్క బస్సును అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుండి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడపబడుతుందని పేర్కొన్నారు.

allso read- సరస్వతీ కటాక్షం ఉన్నా.. లక్ష్మి కటాక్షం లేక

అయ్యప్ప స్వామి భక్తుల కోసం అందుబాటులో టిఎస్ఆర్టిసి డిపోలలో అవసరమైన బస్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. శబరిమల యాత్ర దూర ప్రయాణం కావున టిఎస్ఆర్టిసి సంస్థ వారి సురక్షితమైన డ్రైవర్ల చేత నడపబడుతున్న బస్సు ప్రయాణం సురక్షితం – శుభప్రధమని అన్నారు. ఆర్టీసీ బస్సులలో ముందస్తు సీట్ రిజర్వేషన్ కొరకు, శబరిమల యాత్రకు  కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్ ల కొరకు www.tsrtconline.in సందర్శించాలని కొరారు.

అడ్వాన్స్ బుకింగ్ పై 10% రాయితీ, సలహాలకు, సూచనలకు, ఫిర్యాదుల కొరకు టీఎస్ఆర్టీసీ  కాల్ సెంటర్ 040 23450033, 69440000 సంప్రదించగలరని, మరిన్ని వివరాల కోసం సంబంధిత డిపో మేనేజర్ లను సంప్రదించాలని వివరించారు. శబరిమల యాత్రలకు టిఎస్ఆర్టిసి బస్సులను వినియోగించుకుని టిఎస్ఆర్టిసి సంస్థను బలోపేతం చేయాలని అయ్యప్ప స్వాములు మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు.