– పల్లె ప్రగతికి సన్నదం కావాలి
– జిల్లా కలెక్టర్ సిక్త పాట్నాయక్
(ఇచ్చోడ నేరడిగొండ విజయం న్యూస్);-
పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నదం కావాలని జిల్లా కలెక్టర్ సిక్త పాట్నాయక్ అన్నారు, గురువారం నెరడిగొండ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు పల్లె ప్రకృతి వనం,సిగ్రిగేషన్ షెడ్,బోథ్ ఎక్స్ రోడ్ లోని పట్టణ పార్క్ ప్రాంతాన్ని ఆమె సందర్శించ్చారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.ఈ నెల20 నుండి జూన్5 వరకు జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రామనికి అన్ని విధాల సిద్ధం కావాలన్నారు.మాన ఊరు – మాన బడి కార్యక్రమం కింద నెరడిగొండ మండల పరిషత్ పాఠశాలను ప్రతిపాదించిన పనుల పై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు డైనింగ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఏక్సికిటివ్ ఏజన్సీ అధికారులను ఆదేశించారు.
also read :-అదనపు కట్నం కోసం వేధింపులు
ప్రతిపాదిత మరమ్మతులను చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీ నిధులతో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని మరుగుదొడ్లు,ప్రహరిగొడ,కిచెన్ షెడ్ లను ఉపాధి హామీ నిధులతో పనులు చేపట్టాలని సూచించారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి శానిటేషన్ పనులు పనులు చేపట్టాలన్నారు చెట్ల నుండి రాలిన ఆకులను ప్రతి రోజు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా సిగ్రిగేషన్ షెడ్లకు తరలించాలని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో గ్రీనరి పెంచాలని స్థానిక సర్పంచుకు సూచించారు. అవసరమైన వాషింగ్,క్లినింగ్ లకు గ్రామపంచాయతీ నిధులు వాడుకోవాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మరో డాక్టర్ ను నియమించాలని.స్థానిక ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ను కోరారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించి ఎక్కువ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని మొక్కల ఉత్పత్తి చాలా తక్కువగా ఉందని హరితహారం కు కావలసిన నర్సరీలలోనే పెంచాలన్నారు.
also read :-ఇంటర్ పరీక్షలు తనిఖీ
వేసవి తీవ్రత ఎక్కువ ఉన్నందున మొక్కలు ఎండిపోకుండా సంరక్షించుకోవాలన్నారు.పల్లె ప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.సిగ్రేషన్ షెడ్ లలోని చెత్త తో వర్మీ కంపోస్టు తయారు చేసుకోవాలని సూచించ్చారు. బోథ్ ఎక్స్ రోడ్ వద్ద చేపడుతున్న పట్టణ ప్రగతి వనంలో 3.40 లక్షల మొక్కలు నాటడానికి గుంతలను సిద్ధంగా ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్,డిప్యూటీ గ్రామీణ అభివృద్ధి అధికారి రవిందర్ రాథోడ్,జడ్పిటిసి జాదవ్ అనిల్,ఎంపిపి రాథోడ్ సాజన్, స్థానిక సర్పంచ్ వెంకటరమణ,మండల ప్రత్యేక అధికారి రవిశంకర్,ఎంపిఓ శోభ తదితరులు పాల్గోన్నారు.