Telugu News

సమాజ సేవలో గ్రామీణ వైద్యులు ముందంజ:ఎమ్మెల్యే కందాళ

వారి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని హామి

0

సమాజ సేవలో గ్రామీణ వైద్యులు ముందంజ:ఎమ్మెల్యే కందాళ

== పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

== వారి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని హామి

(ఖమ్మంప్రతినిధి/కూసుమంచి-విజయంన్యూస్)

సమాజసేవలో గ్రామీణ వైద్యులు చాలా ముందంజలో ఉన్నారని, వారి సేవలను మరవలేమని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హామినిచ్చారు.

ఖమ్మం నగరంలో ఆదివారం బైపాస్ రోడ్ కృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 20వ మహాసభకు ముఖ్యఅతిథిగా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడరు. శభాష్ గ్రామీణ వైద్యులు, సమాజ సేవలో గ్రామీణ వైద్యులు ముందంజ లో ఉన్నారని, సమాజంలో గ్రామీణ వైద్యుల సేవలు మరువలేనివని అన్నారు. రోగాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి మెరుగైన వైద్యాన్ని సమయానికి అందెల చూస్తున్నారు. గ్రామీణ వైద్యులు అంటే ప్రాణ దాతలని వారి వల్ల కొన్ని వేల కుటుంబాలు అనాధలు  కాకుండా నిలబడుతున్నాయని  కొనియాడారు.

allso read- “కందాళ”కు పరీక్షే నా..?

సంఘం కార్యాలయానికి తమ వంతుగా నగదు రూపంలో గానీ స్థలం రూపంలో గానీ కొంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తమ సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ  అజయ్ కుమార్ చోర్వాత ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. వైద్యం అంతే వ్యాపారం కాదని సేవా భావంతో కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారు ఎవరికి వ్యతిరేకం కాదని, ఆగిపోయిన శిక్షణా తరగతులను మళ్లీ పునర్దించి జీవో ప్రకారం అర్హులైన వారికి సర్టిఫికెట్ లను అందజేసి నకిలీ అని అవమానించే వారి నుండి రక్షించాలని కోరారు . అనంతరం వచ్చిన అతిథులను మరియు వివిధ మండలాల అధ్యక్షులను, కార్యదర్శులను ఘనంగా శాలవలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల  నాగేశ్వరావు వహించి మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామీణ వైద్యులందరికీ శిక్షణ ఇప్పించి గుర్తింపు ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చారని, ఆయన చనిపోవడంతో ఆగిపోయిందని, ఆ తర్వాతకి తెలంగాణ ఉద్యమం మొదలైందని ఈ తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ వైద్యుల్లంత చాలా చురుకుగా క్రియాశీలకంగా పనిచేశారని , రాష్ట్ర రోకలో , సకల జన సమ్మెలో పాల్గొన్నారని అన్నారు. ఆనాడు కేసీఆర్ ఏదైతే ఆగిపోయిందో గ్రామీణ వైద్యులకు మళ్లీ శిక్షణను ఇప్పించి సర్టిఫికెట్లు జారీ చేపిస్తానని, అలాగే వైద్య వృత్తిలో కొన్నిటిని క్రియాశీలకం చేస్తానని ఆనాడు మాటిచ్చారని అది ఇంతవరకు చేయడం లేదని, క్రియా రూపంలో దాచలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

allso read- నేను తలుచుకుంటే..? అడుగుపెట్టగలవా రేవంత్ :రేగా

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, జెడ్పిటిసి వరప్రసాద్, రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా – వేణు, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, ఖమ్మం జిల్లా కమిటీ, జిల్లా కార్యదర్శి అనంతరపు వెంకటాచారి, సంకల్ప హాస్పిటల్ డాక్టర్ రాకేష్, డాక్టర్ చైతన్య, క్యాన్సర్ నిపుణులు డాక్టర్ వంశీ, పిల్లల డాక్టర్స్ డాక్టర్. గౌతం, డాక్టర్ రాజ్ కుమార్, ఎందుక్రైనాలోజిస్ట్ డాక్టర్ కావ్య, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్.ప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. మణికుమార్, ఎం.సుదర్శన్, పి.వెంకటరామయ్య లు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల నలుమూలల నుండి విచ్చేసిన గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.