Telugu News

రఘురాంరెడ్డికే  మద్దతు ప్రకటించిన గ్రామీణ వైద్యులు

కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థి రఘురాం రెడ్డి, జిల్లా నాయకులు ప్రసాద్ రెడ్డి

0

రఘురాంరెడ్డి కే  మద్దతు ప్రకటించిన గ్రామీణ వైద్యులు

– ప్రకటించిన గ్రామీణ వైద్యులు, దైవ సేవకులు
– కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థి రఘురాం రెడ్డి, జిల్లా నాయకులు ప్రసాద్ రెడ్డి

(ఖమ్మం-విజయం న్యూస్):

విద్వేషాలు, విషపూరిత కుట్రలను నిలువరించేందుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం బాధ్యులు తెలిపారు. మతతత్వ కల్లోలాలను నిలువరించేందుకు లౌకికవాద కాంగ్రెస్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. గ్రామాల్లో, తమ ప్రాంతాల్లో పర్యటించి రఘురాం రెడ్డికి భారీ మెజారిటీ తీసుకొస్తామని అన్నారు. ఈ సందర్భంగా మద్దతు ప్రకటించిన వారందరికీ.. రఘురాoరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, చావా శివ రామకృష్ణ, ఎండీ. ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- నేడు కొత్తగూడెంకు ముఖ్యమంత్రి రాక