పల్లె ప్రకృతి వనం అగ్నికి ఆహుతి..!
—-అప్రమత్తమైన పంచాయితీ సిబ్బంది అధికారులు
—–వెంటనే స్పందించి మంటలు అర్పిన అగ్నిమాపక శాఖ అధికారులు
(మహబూబాబాద్-చిన్నగూడూరు విజయం న్యూస్)
మహబూబాబాద్ జిల్లా చిన్న గుడూరు మండల కేంద్రంలోని పల్లే ప్రకృతి వనం అగ్ని కీలల్లో చిక్కుకుని కాళీ బూడిద అయింది.స్థానిక పంచాయితీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదవశాత్తు అంటుకున్న మంటల్లో మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం మంటల్లో కాళీ పోయింది. సుమారు 500 లకు పైగా మొక్కలు కాలి పోయినట్లు వారు తెలిపారు. సమాచారం తెలియగానే వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది పల్లె పకృతి వనం మంటలను ఆర్పారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అజిమ్,సర్పంచ్ కొమ్ము మల్లయ్య,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.