Telugu News

కందాళ సేవకు సలామ్

ఒక్కోక్క వినాయక విగ్రహంకు రూ.10వేలు అర్థిక చేయూత

0

కందాళ సేవకు సలామ్

== ఒక్కోక్క వినాయక విగ్రహంకు రూ.10వేలు అర్థిక చేయూత

== పాలేరు నియోజకవర్గంలోని 1200 వినాయక విగ్రహాలకు అందజేత

== రూ.1.20 లక్షలను ఖర్చు చేస్తున్న ఎమ్మెల్యే కందాళ

== హర్షం వ్యక్తం చేస్తున్న పాలేరు నియోజకవర్గ ప్రజలు

(కూసుమంచి-విజయంన్యూస్)

దానకర్ణుడ పేరుకు కేరాఫ్  అడ్రస్ కందాళ ఉపేందర్ రెడ్డి అని చెప్పవచ్చు.. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా చేయూతనందిస్తూ వస్తున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు.. స్వంత డబ్బులతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందజేస్తున్న కందాళ ఉపేందర్ రెడ్డి, ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి కానుకను ప్రకటించారు. వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్న గణేష్ భక్తులకు కందాళ ఉపేందర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.. ఒక్కోక్క విగ్రహానికి రూ.10వేల చొప్పున అర్థిక చేయూతనందిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఆయన ఇప్పటికే వినాయక విగ్రహాల వద్దకు వెళ్లి రూ.10వేలను కమిటీ బాధ్యులకు అందజేస్తున్నారు. వర్గాలకు, పార్టీలకు అతీతంగా ఆయన, వారి సతిమణి, కుమార్తేలు ఇద్దరు వేరువేరుగా  ప్రతి గ్రామాల్లో పర్యటించి ఆయా మండపాల వద్దకు స్వయంగా వెళ్లి పూజలు చేసి రూ.10వేలను అందజేస్తున్నారు.  ఇది కూడా చదవండి:    ప్రజల కోసమే పనిచేస్తున్నా: కందాళ

== 1200 విగ్రహాలకు చేయూత

పాలేరు నియోజకవర్గంలోని 125 గ్రామ పంచాయతీలు, 175 గ్రామాల్లో, తండాలో భక్తులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు మొత్తం 1200 ఉన్నట్లుగా పోలీసులు  పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రిపోర్ట్ ఇచ్చారు. మొదటిగా విగ్రహానికి రూ.5వేల ఇద్దామని భావించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, నేటి ఖర్చులు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చేయూతనందించాలని భావించి ఒక్కోక్క విగ్రహానికి రూ.10వేల చొప్పున అర్థిక చేయూతనందిస్తున్నారు. దీంతో రూ.1.20కోట్ల భారం పడనుంది. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్వంత డబ్బులతో ప్రజలకు చేయూతనందిస్తున్నారు. దీంతో పాలేరు నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నిర్ణయం హర్షించదగ్గ విషయమని, డబ్బులు ఉన్న చేయూతనందించలేని వారు చాలా మందిని చూశామని, కానీ అడగకుండానే అర్థిక చేయూతనందిస్తున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటామని భక్తులు ప్రకటిస్తున్నారు. వినాయక మండపాల వద్దకు వస్తున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు భక్తులు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు  పై రాజకీయ వేధింపు కేసులు సరికాదు : ఎమ్మెల్యే కందాళ