Telugu News

సల్లంగ చూడు శివయ్య..!

-శైవాలయాలను సందర్శించిన పొంగులేటి

0

సల్లంగ చూడు శివయ్య..!
-శైవాలయాలను సందర్శించిన పొంగులేటి

(ఖమ్మం విజయం న్యూస్):-

ఉమ్మడి జిల్లాలోని ప్రజలందరూ పాడిపంటలతో తులతుగాలని… సుఖసంతోషాలతో వర్థిల్లాలని… ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని దయతో సల్లంగ ఉండాలని కోరుకుంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు శైవాలయాలను తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉమ్మడి జిల్లాలోని దమ్మపేట మండలం ముష్టిబండ, పెనుబల్లి నీలాద్రి, కల్లూరు పుల్లయ్యబంజర, తల్లాడ నూతనకల్, వైరా స్నానాల లక్ష్మీపురం, కొణిజర్ల పల్లిపాడు, ఖమ్మం అర్బన్ లోని ధంసలాపురం, ముదిగొండ వల్లాపురం, కూసుమంచి శివాలయం, ఖమ్మం రూరల్ తీర్థాల జాతరలను సందర్శించారు.

also read :-అన‌స్థీషియా హై డోస్ హ‌డావుడిగా ఆప‌రేష‌న్లు

ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజలు, అభిషేకాది కార్యక్రమాల్లో పొంగులేటి పాల్గొన్నారు. పలు ఆలయాల్లో జరిగిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం ప్రతిఒక్కరిపై ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఆయా ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో పొంగులేటిని ఘనంగా సత్కారించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, డాక్టర్ మట్టా దయానంద్, ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు మలీదు జగన్, దొడ్డా నగేష్, పండు, శ్రీనివాసరెడ్డి, గణేషులు రవి, కోసూరి శ్రీను, మందడపు రామకృష్ణారెడ్డి, అనంతరెడ్డి, బారి వీరభద్రం, సర్పంచ్ బాలు, అట్లూరి సత్యనారాయణరెడ్డి, రావు గంగాధర్, దారా యుగంధర్, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.