అంబరాన్ని తాకేలా సంబురాలు చేయాలి: మంత్రి పువ్వాడ
నగరపాకల సంస్థ సమావేశంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ మున్సిపల్ సమావేశ మందిరంలో జూన్ 2 నుండి 21 రోజుల పాటు నగరంలో దశాబ్ధి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కలసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించే విధంగా రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందన్నారు.
ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన అనేక అభివృద్ది పనుల నాడు – నేడు పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు ఖమ్మం మున్సిపల్ పరిధిలో ఘనంగా జరుపుకోవాలని కార్పొరేటర్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి విజయవంతం చేయాలనీ కోరారు. మున్సిపల్ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిసేవిధంగా డాకుమెంటరీ చేయాలనీ అన్నారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.