Telugu News

జలగం వెంగళరావు స్వగ్రామంలో సంభాని పర్యటన

ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

0

జలగం వెంగళరావు స్వగ్రామంలో సంభాని పర్యటన

== హత్ సే హత్ జోడో యాత్రకు భారీ స్పందన

== ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

(సత్తుపల్లి/పెనుబల్లి-విజయంన్యూస్)

 సత్తుపల్లి నియోజకవర్గంలో 42వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో  ఈరోజు పెనుబల్లి మండలంలోని బయ్యన్నగూడెం, లంకాసాగర్ గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటి ఇంటికి తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని తెలుపుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్‌ని ప్రజలకు అందిస్తూ ఈ క్రింది విధంగా మాట్లాడారు.బీజేపీ ప్రభుత్వంలో దేశ సమగ్రతకు, దేశ రక్షణకు భంగం వాటిల్లిందని, మతాల మధ్య చిచ్చుపెట్టి  మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించడం జరిగిందన్నారు.

allso read- కర్టాటక సీఎం ఎంపిక నిర్ణయం హైకమాండ్ దే

రైతు వ్యతిరేకచట్టాలు చేసి, అక్రమ అరెస్టులతో అన్నదాతలపై కేసులు నమోదుచేసి రైతు ఆత్మహత్యలకు కారణమవుతూ వారి జీవితాల్ని నట్టేట ముంచుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు బిల్లు తెస్తే, నేటి వరకూ కూడా బిల్లుపాస్ చేయకపోవడం బీజేపీ పార్టీకి మహిళలపై ఉన్న చిన్నచూపుకి నిదర్శనం, మహిళలపై ఆకృత్యాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.  ప్రభుత్వ రంగాలని ప్రయివేటుపరం చేసి దేశ ఆర్థికవ్యవస్థని చిన్నాభిన్నం చేశారని తెలిపారు.  ప్రతి సంవత్సరం యువతకి 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ప్రైవేట్ రాంగాలని ప్రోత్సహించడం వల్ల ఏడాదికి సుమారు 40 లక్షల ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం పెరిగిందన్నారు.  నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అధికంగా పెంచి సామాన్యులు ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సమగ్రత, సమైక్యత కొరకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర ఫలితమే ఈ విజయమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురేస్తామన్నారు.

allso read- కర్ణాటకలో క్యాబినెట్ కు ముహుర్తం ఖారారు..ఎప్పుడంటే..?

పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీ సెల్  కన్వీనర్ కొండూరు కిరణ్, మండల ఉపాధ్యక్షులు వడ్లమూడి కృష్ణయ్య, మాజీ గ్రామసర్పంచ్ కొండపల్లి శ్రీనివాసరావు, ఈడా కమలాకర్, కర్రి సత్యనారాయణ, పామర్తి నైస్ బాబు, మరీదు వెంకటరావు, గణేష్,గుగులోతు రాంసింగ్, మాధవ్, గరిడేపల్లి శ్రీను, గడిపర్తి శ్రీను, గద్దె శ్రీను, కాకా వెంకటేశ్వర్లు, బల్లి కాసులు, బెల్లంకొండ సీతారాములు, భోగి నరసింహారావు, అమర్నాథ్, సురేష్ నాయక్ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.