Telugu News

సమ్మక్క సారలక్క గద్దెను సందర్శించిన పొంగులేటి

ఆలయ మర్యాదలతో ఘన సన్మానం

0

సమ్మక్క సారలక్క గద్దెను సందర్శించిన పొంగులేటి

ఆలయ మర్యాదలతో ఘన సన్మానం

ఖమ్మం : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ఇందులో భాగంగా నగరంలోని కాల్వొడ్డులోని సమ్మక్క సారలక్క గద్దెను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి కృపా ప్రతిఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి అండగా ఉంటానని నిర్వాహకులకు భరోసా ఇచ్చారు. శ్రీరాంహిల్స్ లో కురివెల్ల సత్యనారాయణ కుమార్తె వివాహం సందర్భంగా వారి స్వగృహంలో పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. అజ్మీరా అశోక్ నాయక్ కుమారుని పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి తేజ్ సాయికు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాటేటి వెంకన్న అనారోగ్యానికి గురైనందున ఆయనను పరామర్శించారు. మంచుకొండ గ్రామంలో మందడపు సుధాకర్ తల్లి చనిపోయినందున ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

also read :-పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత : మాజీ ఎంపీ పొంగులేటి

కుటుంబ సభ్యులను పరామర్శించారు. పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పోరేటర్ దొడ్డా నగేష్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీపీ గోసు మధు, కానంగుల రాధాకృష్ణ, మందడపు రామకృష్ణారెడ్డి, మాటేటి రవి, చల్లా రామకృష్ణారెడ్డి, వట్టికూటి సైదులు గౌడ్, ఉప్పి సాయి, బైరోజు యాదగిరి,దూదేకుల సంఘం నాయకులు సైదులు, సాయి, సాంభ, దుర్గ, వెంకటలక్ష్మీ, కోటమ్మ, యువనేత గోపి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.