Telugu News

“తగ్గేదేలే అంటున్న” ఇసుక మాఫియా

పట్టించుకుని అధికారులు 

0
“తగ్గేదేలే అంటున్న” ఇసుక మాఫియా
== పట్టించుకుని అధికారులు
 తిరుమలాయపాలెం, మార్చ్ 10 (విజయం న్యూస్)
 తిరుమలాయపాలెం మండలంలోని ముజాహిద్ పురం గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది.. పట్టపగలే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.. పోలీసులకు, అధికారులకు తెలిసినప్పటికి ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. పత్రికల్లో వచ్చినప్పుడు కొద్ది రోజులు ఆపి.. ఆ తరువాత మళ్లి రెచ్చిపోతున్న ఇసుక మాఫియా పంట పొలాలు నుండి ఇసుక తొలకాలు చేస్తున్నారు.  వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను తలిస్తున్నారు.  ఈ ఇసుక తవ్వకాలను రైతులు అడ్డుకోవడంతో వారిపై  దాడులకి పాల్పడుతున్నారు. ఇటివల ఓ యువకుడి పై దాడి చేసిన సంగతి తెలిసిందే.  మరోసారి దాడులు జరిగే అవకాశం ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా అధికారుల వ్యవహారం చోద్యం చూస్తున్న రెవెన్యూ,మైనింగ్, పోలిస్ శాఖ అధికారులు పట్ల పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.