Telugu News

ఇసుక క్వారీల్లో జీరో దందా….

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పట్టపగలే రవాణా

0

 

ఇసుక క్వారీల్లో జీరో దందా….

 

★ ఒకే వే బిల్లుపై  ఐదు ట్రిప్పులు…

 

★ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి…

 

★ నిద్రావస్తలో టిఎస్ఎండిసి అధికారులు….

 

విజయం న్యూస్, (భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా, టాస్క్ ఫోర్స్):

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్లో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. ఖనిజ సంపదకు నెలవైన పినపాక నియోజకవర్గం లో పదుల సంఖ్యలో అక్రమ మార్గంలో ఇసుక రవాణా యదేచ్చగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ర్యాంపుల కేటాయింపులో లోపాలను ఆధారంగా చేసుకున్న మైదాన ప్రాంతానికి చెందిన ఓ గుత్తేదారు నియోజకవర్గానికి చెందిన గిరిజన సొసైటీ రాంపులపై కన్నేశాడు. ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించాల్సిన ఇసుకతవ్వకాలు ఈ అక్రమార్కునికి   జేబులు నింపుతున్నాయి . గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక తోలకానికి నానా కొర్రీలు పెట్టే అధికారులు ఈ ఇసుకాసురులకు మాత్రం అడిగిందే తడువుగా అనుమతులు ఎలా ఇస్తున్నారనీ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇతగాడు ఇచ్చే కాసుల కక్కుర్తి తో ప్రభుత్వ అధికారులు ర్యాంపుల వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో ప్రతినిత్యం మణుగూరు మండలంలోని ఓ ఇసుక ర్యాంపు నుండి వందల కొద్ది లారీలు ఖమ్మం, హైదరాబాద్,వంటి దూర ప్రాంతాలకు తరలి వెళ్తున్న పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆక్రమార్కుడు ఆడిందే ఆటగా పాటగ ఇసుక ర్యాంపుల్లో చక్రం తిప్పుతుండడంతో స్థానిక ప్రజలకు ఉపాధి కరువై నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

allso read- మణుగూరులో మరో సోను సూద్..

అధికారులకు సెలవు దినాలు వచ్చాయంటే ఆయనకు మరింత పండగే అధికారుల కళ్ళు కప్పి భారీ యంత్రాలతో టన్నులకొద్దీ ఇసుకను జీరో దందాతో సుదూర ప్రాంతాలకు తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాడు ఇదేమని ప్రశ్నించే వారిపై దుర్భాషలాడుతూ తనకంత అండగా ఉందని మంత్రి గారి బంధువుని అంటూ మరింతగా చిందులేస్తుంటాడు. మరోవైపు స్థానిక అధికారులను  నాయకులను ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని వారికి కూడా ముడుపులు ముట్ట చెపుతుండటంతో దందాకు అడ్డే లేకుండా పోతుంది మరోవైపు గిరిజనుల ఉపాధి లేకుండా చేస్తుండడంతో గిరిజన ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఈ అక్రమార్కుని దందాతో  అధికారులు చేతులు కట్టుకొని చూస్తున్నారే తప్ప కనీసం చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కోట్ల విలువైన ఖనిజ సంపద తరలి వెళ్తున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కుడు మరింతగా చెలరేగి ఇసుక దందాను కొనసాగిస్తున్నాడు గత సంవత్సరం కాలంగా అక్రమ రవాణా ద్వారా లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్లాది రూపాయలను దండుకుంటున్నారనే విమర్శలు సైతం బలంగా వినిపిస్తున్నాయి, దాచుకున్న వాడికి దోచుకున్నంత అన్నట్లుగా పినపాక నియోజకవర్గం లో అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగుతుంది ఈ దందాకు అధికార పార్టీ నాయకుల నుండి అండదండలు పుష్కలంగా లభించడంతో అక్రమ గుత్తేదారు మరింతగా ఘనంగా ఘనపాటిగా ఇసుక మాఫియాను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉందనే సాకుతో  గుత్తేదారులు అడ్డగోలుగా దోచుకుంటు జీరో దందా కొనసాగిస్తూ ప్రభుత్వ నిబంధనలకు గండి కొడుతున్నారు. రైతుల అభ్యర్థన మేరకు సొసైటీ ర్యాంపులు నిర్వహించుకుని ఆర్థికంగా స్వలాభం పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ర్యాంపుల నిర్వహిస్తుంటే బినామీ వ్యాపారులు గిరిజనులకు తులమోఫలము ముట్టజెప్పి వారిని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ప్రభుత్వ అధికారుల కన్నుగప్పి నిత్యం వందల క్యూబిక్ మీటర్ల ఇసుకను తప్పుదోవ పట్టిస్తూ ఇష్టానుసారంగా అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మంత్రుల అనుచరులమని  ప్రగల్బాలు పలుకుతూ కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. ఇష్టానుసారంగా గోదావరి గుండెల్ని కొల్లగొడుతూ ఇసుక మాఫియాకు తెరలేపి ఇందులో ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి మంత్రిగారి పేరు చెప్పి చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

== ఇసుక దందాలో పాత్రికేయుల హస్తం                          allso read-బూర్గంపాడు కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి

మణుగూరు సబ్ డివిజన్లో గోదావరి పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులన్నీ కొందరు స్థానిక పాత్రికేయులు బినామీలతో చీకటి ఒప్పందాలు చేసుకొని దందా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది జీరో లారీల ఇసుకను నగరాలకు తరలించేందుకు వీరు ప్రత్యేక పాత్ర పోషిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్ స్థానిక పాత్రికేయులు ఒకే సామాజిక వర్గం కావడంతో ఈ పాత్రికేయులకు ప్రత్యేక ఉపాధి  కల్పిస్తున్నట్లు తెలుస్తోంది మణుగూరులో పాత్రికేయులు ఇసుక దందాపై ఎలాంటి వార్తలు రాసిన సాటి విలేకరులను అవహేళన చేస్తూ ముత్తేదారులకు వత్తాసు పలుకుతూ జర్నలిజం విలువలను నీరుగారిస్తున్నారు అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ వారి పాపాలలోనూ మీరు కూడా పాలుపంచుకుంటూ జర్నలిజం విలువలకే మచ్చ తెస్తున్నారని జర్నలిస్టు సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తు వేరే కౌంటర్లు ఇస్తూ అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదే దందా ప్రతి మండలంలో జరుగుతుందని దీనికి కారణం ఒకే సామాజిక వర్గం అవడంతోనే విచ్చలవిడిగా చెల్లరేగుతున్నారు. ఇందులో ముఖ్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారని పలువురి వాదన ఇప్పటికైనా అధికారులు ఆ పాత్రికేయులు ఎవరని గుర్తించాలని పలువురు కోరుచున్నారు.

== నిద్రావస్తలో టిఎస్ఎండిసి అధికారులు

మణుగూరు సబ్ డివిజన్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనుమతులు పొందిన ఇసుక ర్యాంపులను కొందరు బినామీలు శాసిస్తున్నారని ఉన్నతాధికారులకు తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న శైలి పలు అనుమానాలకు దారితీస్తుంది. అడ్డగోలుగా జీరో దండాలు నడుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న పట్టించుకోకపోవడంపై అధికారుల ఉధాశీనతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వారు చెప్పినవిధంగానే   కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు వీటికి పుల్ స్టాప్ పడాలంటే డీఎస్ఎండిసి అధికారులు అక్రమ ఇసుక దందాపై దృష్టి సారించక పోతే  ప్రభుత్వ ఆదాయానికి  భారీగా గండి పడుతుందిని పలువురు చర్చించుకుంటున్నారు.