మంత్రులను అభినందించిన సండ్ర
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర.
మంత్రులను అభినందించిన సండ్ర
== తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
సమతామూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చాంబర్లలో ఆశీనులైన మంత్రులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అభినందించారు. వారిని ప్రత్యేకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, మహమ్మద్ అలీ, సభిత ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ను కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాలను వారికి అందజేశారు. శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ శ్రీవారి ప్రసాదాన్ని మంత్రులకి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించేలా ఆధునిక హంగులతో, అద్భుతమైన నిర్మాణ రీతులతో నూతన సచివాలయం రూపుదిద్దుకున్న తరుణంలో ఈ కొత్త సచివాలయం ఈ రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవటం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. ఎంతో గొప్పగా జరిగిన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలలో సీఎం కేసీఆర్ గారితో సహా మంత్రులు పలు కీలక ఫైళ్ల మీద తొలి సంతకాలు రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు వేయటం రాష్ట్ర అభివృద్ధి పురోగతికి నిదర్శనం అన్నారు.
ఇది కూడా చదవండి: నూతన సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన మంత్రి పువ్వాడ..