Telugu News

సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన సండ్ర 

క్షేత్రస్థాయి పనులను పరిశీలించి వేగంగా పనులు చేయాలని ఆదేశం

0
సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన సండ్ర 
== క్షేత్రస్థాయి పనులను పరిశీలించి వేగంగా పనులు చేయాలని ఆదేశం
== హాజరైన జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్
సత్తుపల్లి, మే 20(విజయంన్యూస్):
 సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికారులకు ఆదేశించారు.   శనివారం సత్తుపల్లి మండలం యాతాలకుంట లో జరుగుతున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్  క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌ పనులు ముమ్మరంగా చేపట్టి, పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్ట్‌ క్రింద భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందజేత చర్యలు వెంటనే పూర్తి చేయాలన్నారు. టన్నెల్‌ పనుల్లో వేగం పెంచాలని ఆయన తెలిపారు. మెషినరీ, పనివాళ్లను పెంచాలని, పనులు త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టర్‌ తనిఖీ సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, కల్లూరు ఆర్డీవో సిహెచ్‌. సూర్యనారాయణ, ఇర్రిగేషన్‌ ఇఇ కె. సురేష్‌ కుమార్‌, డిఇలు చంద్రశేఖర్‌, మోతీలాల్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపిడిఓ సుభాషిణి, అధికారులు తదితరులు ఉన్నారు.