Telugu News

పశువుల కోసం సండ్ర దాతృత్యం

150 ట్రక్కుల పశుగ్రాసంను తరలించిన ఎమ్మెల్యే సండ్ర

0

పశువుల కోసం సండ్ర దాతృత్యం

== ఖమ్మంలోని 11 గోశాలకు పశుగ్రాసం వితరణ

== 150 ట్రక్కుల పశుగ్రాసంను తరలించిన ఎమ్మెల్యే సండ్ర

== ర్యాలీని ప్రారంభించిన ఎంపీ గాయత్రి రవి, ఎమ్మెల్యే సండ్ర

(సత్తుపల్లి/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మూగజీవాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మహాలక్ష్మి దంపతులు దాతృత్యం చాటుకున్నారు. ఖమ్మంలోని 11 గోశాలలకు పశుగ్రాసంను అందించేందుకు గాను సత్తుపల్లి నియోజకవర్గంలోని పరిసరాల్లో లభించే వరిగడ్డిని సేకరించిన సండ్ర వెంకటవీరయ్య తన స్వంత డబ్బులతో గోశాలలకు పశుగ్రాసాన్ని వితరణ చేశారు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని పలు గోశాలలకు పశుగ్రాసం పంపిస్తున్నారు. ప్రతి ఏడాది లాగే  ఈ ఏడాది కూడా 150 ట్రాక్టర్ల టక్కులలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఖమ్మం తరలించారు. ముందుగా సత్తుపల్లి నియోకజవర్గ పరిధిలో ట్రాక్టర్ల ర్యాలీని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, అదనపు కలెక్టర్ మధుసూదన్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య జెండా ఊపి ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన సండ్ర 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  గోశాలలో నిర్వహించిన గోపూజలలో పాల్గొన్నారు. మూగ జీవాలకు పశుగ్రాసాన్ని వితరణ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతిలో గోమాతను దేవతగా భావిస్తారని, గో సేవ ఎంతో గొప్ప కార్యక్రమమని వాటికి సేవ చేసుకునే భాగ్యం పశుగ్రాస వితరణతో కలగడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మంలోని 11 గోశాలలకు సత్తుపల్లి నియోజకవర్గం నుండి 150 ట్రాక్టరు ట్రక్కుల పశుగ్రాసాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేసారు. ఖమ్మంలోని టేకులపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాల వద్ద రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అదనపు కలెక్టరు మధుసూదన్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతులు గోపూజ నిర్వహించి పశుగ్రాసాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ నోరు ఉండి మాట్లాడగలిగే ప్రతి జీవికి ఏదో రకంగా సహాయం అందుతున్న తరుణంలో నోరులేని మూగజీవాలకు సహాయం అందించాలనే సంకల్పంతో సత్తుపల్లి నియోజకవర్గ రైతులు సహకారంతో ఐదు ఏళ్ల నుండి గోశాలలకు పశుగ్రాసాన్ని వితరణ చేస్తున్నామని అన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా 120 కిలోమీటర్ల నుండి ఖమ్మంకు 150 ట్రాక్టర్ల ట్రక్కుల పశుగ్రాసాన్ని ఆనందించేందుకు రైతులు పిలుపు మేరకు స్వచ్చందంగా సహకరించారన్నారు.

ఇది కూడా చదవండి: కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

రైతుల జీవితంతో ముడిపడి ఉన్న గోసంపదని రక్షించాలి, గోవును పూజించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని విధాల సహాయం అందిస్తే, నోరులేని మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడడంతో, గోవులకు సహాయం అందించాలని ఆ రోజుల్లో పిలుపునిస్తే వందల సంఖ్యలో పశుగ్రాసం దొరకని సమయంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో భద్రాచలం గోశాలలకు పశుగ్రాసాన్ని అందించామన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా గోశాలకు పశుగ్రాసాన్ని అందించి చేయూతని ఇచ్చామన్నారు.