న్యాయానికి సంకేళ్లా..?:వైఎస్సార్టీపీ
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం , బిఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం .
న్యాయానికి సంకేళ్లా..?:వైఎస్సార్టీపీ
== వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో సంకెళ్లు తో నిరసన,
== అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం , బిఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం .
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జడ్పీ కూడలిలో హైదరాబాద్ లోటోస్ పాండేలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ అరెస్టు పై వైస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం తుంపాల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సంకెళ్లు తో నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి బిఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని, ప్రశ్నించే గొంతుకను అణిచి వెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
allso read- వైఎస్ షర్మిళ కు బెయిల్ మంజూరు
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారతీయ రాజ్యాంగము తో మేము సంతోషిస్తున్నాము మీరు ఇచ్చిన సమానత్వం సౌభ్రాతృత్వం మరియు సమసమాజ నిర్మాణం మొదలు పెట్టిన తమరు మాకు ఆదర్శ ప్రాయులు అయితే మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తో మేము తెలంగాణను తెచ్చుకున్నాము మా బ్రతుకులు మారతాయి అని సంతోషించాము కానీ తెలంగాణా కు కెసిఆర్ కుటుంబం రూపంలో ప్రజాస్వమ్యానికి సంకెళ్లు వేసిన కెసిఆర్ రాజ్యాంగం లో ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ కార్య్రమాల్లో పాల్గొంటున్నా విపక్షాలను బలవంతపు నిర్బంధాలు అరెస్టు లు బీఆర్ఎస్ ప్రభుత్యం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం లో ఈ కెసిఆర్ అక్రమాలకు తెలంగాణ తల్లి ఆత్మ వేదన చెందుతా ఉంది అన్నారు. కావున మా నాయకురాలు వైఎస్ షర్మిల అక్క ను అక్రమము గా వేదించి బందించి కోర్టు కి తీసుకెళ్లిన విధానము చాలా బాధాకరము అన్నారు. ఇకనైనా ఈ దిక్కుమాలిన కెసిఆర్ రాజ్యాంగం ను రద్దు చేసుకొని తమరు మాకు ప్రసాదించిన భారత రాజ్యాంగాన్ని అమలు జరిగేలా చూడాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమములో మర్రి శ్రీనివాస్, రావుల గంగరాజు, గణపారపు సురేష్, కందిమళ్ల హరీష్ సగ్గుర్టి సుధాకర్, గుండపనేని ఉదయ్, గాజుల వరుణ్, పాషా, వనపర్ల అరుణ, చంద్రకళ, బుల్లి, తదితరులు పాల్గొన్నారు.