Telugu News

‘సంక్షేమ భారత్’ మా లక్ష్యం: సీఎం కేసీఆర్

2024లో మోడీ ఇంటికి..మేము ఢిల్లీకి పోతాం

0

‘సంక్షేమ భారత్’ మా లక్ష్యం: సీఎం కేసీఆర్

== భారతదేశంలో నీటి యుద్దాలేందుకు

== 2024లో మోడీ ఇంటికి..మేము ఢిల్లీకి పోతాం

== దేశ వ్యాప్తంగా దళితబంధు,రైతు బంధు అమలు చేస్తాం

== ప్రభుత్వ ఆస్తులను పబ్లిక్ సెక్టార్ చేస్తామన్న సీఎం కేసీఆర్

== 24గంటల నాణ్యమైన కరెంట్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం

== ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లిస్తాం

== అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్ధు చేస్తాం

== ఎల్ఐసీని ప్రభుత్వ ఫరం చేస్తాం

== మహిళలకు పార్లమెంట్ లో 35శాతం అమలు చేస్తాం

== కొత్త పారిశ్రామిక విధానం అమలు చేస్తాం

== కాంగ్రెస్-బీజేపీ దొందూదొందే

== తమ రాజకీయ స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తున్నరు

== బిఆర్‌ఎస్‌ జాతీయ సభ వేదికగా స్పష్టం చేసిన సీఎం కేసీఆర్

== ఖమ్మం బీఆర్ఎస్ సభకు హాజరైన నలుగురు ముఖ్యమంత్రులు

ఖమ్మం,జనవరి18(విజయంన్యూస్):

భారతదేశ సంక్షమమే తమ లక్ష్యమని, అందుకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికలు వస్తుంటాయి..పోతుంటాయి..ఎవరో ఒకరు గెలుస్తారు.. కొందరు ఓడిపోతారు.. ఇదేనా మన లక్ష్యం…? దేశం లక్ష్యం వైపు పయనిస్తుందా లేదా అన్నదే మనం చర్చించాలి, సంక్షేమం వైపు వెళ్తుందా..? లేదా.? అని ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎటువైపు దేశం వెళ్తుంది, మనమేక్కడున్నామనేదే మనం చూడాలని ఆయన కోరారు. దేశంలో ఏదేశానికి లేని వనరులున్నా మనం ఇంకా అప్పులు చేస్తూ, అడుక్కునే స్థితి ఎందుకని ప్రశ్నించారు. పరస్పర విమర్శలతో కాంగ్రెస్‌, బిజెపిలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వచ్చారని అన్నారు.

ఇది కూడా చదవండి: ‘బీఆర్ఎస్’ పుల్ జోష్.. సీఎం ఖుషి

ఒకరు అధికారంలో మరొకరు విమర్శలు చేయడం తప్ప ఒనగూరిందేవిూ లేదన్నారు. అశేష జనవాహిని, అఖండులైన రాజకీయ ప్రముఖుల  సమక్షంలో ఖమ్మం బిఆర్‌ఎస్‌ ఆవిర్భావసభలో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం, భారత సమాజం లక్ష్యం ఏంటి.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా.. బిత్తరపోయి గత్తర పడుతుందా.. ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో.. ఈ విషయం మీద నా అంతరాత్మ అనేక రకాలుగా కలిచి వేస్తా ఉంది. అందరూ సీరియస్‌గా ఆలోచించాలని పిలుపునిచ్చారు.దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు తీసుకునే అవసరం లేనటువంటి .. ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి.. ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి.. సహాజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని కేసీఆర్‌ అన్నారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. దేశంలో సంపద లేకుంటే బిక్షం ఎత్తుకుంటే తప్పులేదు. కానీ ఉండి మనం ఎందుకు యాచకులం కావాలని ప్రశ్నించారు. ముఖ్యంగా యువత బాగా ఆలోచన చేయాలన్నారు. మతం మత్తులో మనమంతా కొట్టుకు పోవద్దన్నారు. జర్నలిస్టులు కూడా బాగా ఆలోచించాలి. ప్రజలకు అందించే విధంగా చర్చలు పెట్టాలని కోరారు.

== దేశమంతా24గంటల కరెంట్ ఇస్తాం

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశంలో కరెంట్‌ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ వాగ్దానం చేశారు. రెండేళ్లలో వెలుగులు జిలుగుల భారత్‌ను నిర్మిస్తామని హావిూ ఇచ్చారు. దేశంలో 4.10లక్షల మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుందని, కేవలం రూ.2.10లక్షల మెగావాట్లను మాత్రమే వాడుతున్నమని అన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టలను పట్టించుకోకుండా వదిలేశారని, మూలనపడి మూలుగుతున్నాయన్నారు. వాటిని సక్రమంగా వాడుకోకపోవడం వల్ల దేశంలో విద్యుత్ సమస్యలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ తీగలపై బట్టలారేసుకుంటారని హేళన చేశారు. కానీ ఇప్పుడు 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. అదే విధంగా బీఆర్‌ఎస్‌ వస్తే దేశ రైతాంగానికి ఉచిత కరెంట్‌ ఇస్తామని హావిూ ఇచ్చారు.                   ఇది కూడా చదవండి: అంతిమ విజయం మాదే

== నీటి యుద్దాలేందుకు..?

దేశంలో ఇంకా నీటి యుద్దాలు అవసరమా? అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్టాల్ర మధ్య కేంద్రం కొట్లాటలు పెడుతోందని విమర్శించారు. దేశంలో 41 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉందని, లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోందని అన్నారు. ఇందులో 70 వేల టీఎంసీల నీరు ఆవిరైపోతుండగా.. ఇంకో 70 వేల టీఎంసీల నీరు అందుబాటు లో ఉంటుందని ప్రస్తావించారు. భూమి, నీరు, సూర్యరశ్మి అనుకూలంగా ఉన్న దేశం మనదని, ఎన్నో వనరులు ఉన్నా మనం పిజ్జాలు, బర్గర్లు తినాలా?. కందిపప్పు, పామాయిల్‌ దిగుమతి చేసుకోవాలా?. నీటి వనరులు ఉన్నా తాగేందుకు విషపు నీరా?. ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తారు.. అది ఉలుకూ పలుకూ ఉండదని కేసీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. మంచినీరు ఇవ్వడం కేంద్రానికి చేతకావడం లేదని విమర్శించారు. నదీ జలాలు సముద్రం పాలవుతుంటే చూస్తూ కూర్చుంటున్నారని మండిపడ్డారు.నదీ జలాలతో ప్రజల గొంతు నింపాలని, పొలాలను తడపాలని పేర్కొన్నారు. దీనిని నిజం చేసేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టిందని, అవసరమైతే మరో ఉద్యమం తప్పదని అన్నారు.

== బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ..! – కేసీఆర్

2 ఏళ్లలోనే వెలుగు జిలుగుల భారతంను అందిస్తామని, రైతులకు ఉచిత కరెంట్ అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని రైతులందరికి అందిస్తామని, ఎల్ఐసీని జాతీయం చేస్తామని హామినిచ్చారు. ఎల్ఐసీ కార్మికులందరు తప్పకుండా కేంద్రంపై తిరగబడాలని, జై ఎత్తి బీఆర్ఎస్ కు జై కొట్టాలని పిలుపునిచ్చారు.  కరెంట్ రంగాన్ని కేంద్రం ప్రైవేట్ ఫరం చేసేందుకు చూస్తోందని, వామపక్షాల ప్రభుత్వం వస్తే పబ్లిక్‌ సెక్టార్‌లోనే కరెంట్‌ రంగాన్ని నిలుపుతామని హామినిచ్చారు. రాష్త్రంలో దళితులకు దళితబంధు ఇచ్చినట్లుగానే ప్రతి ఏటా 25 లక్షల మందికి దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామినిచ్చారు. అలాగే  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, చట్టబద్దత తీసుకోస్తామని హామినిచ్చారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎంలు

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానిని ప్రైవేట్ ఫరం చేసేందుకు కేంద్రం పన్నాగాన్ని పన్నుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును కచ్చితంగా జాతీయం చేస్తామని హామినిచ్చారు. దేశంలో నీటి వనరులున్న మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న దేశం ఇప్పటి ఉందని, కేంద్రానికి సిగ్గులేకపోయినప్పటికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా దేశ వ్యాప్తంగా మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేసి సురక్షితమైన మంచినీటిని అందిస్తామని హామినిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణ ఆర్మిలో కూడా వేలు పెట్టి అగ్నిపథ్ ను తీసుకొచ్చిందని, ఇది చాలా తప్పు అని, దేశం కోసం ప్రాణాలను తునప్రాయంగా పెట్టి దేశం కోసం పోరాటం చేసే ఆర్మి ఎంపికలో కూడా బీజేపీ ప్రభుత్వం తలదూర్చి చాలా తప్పు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కచ్చితంగా అగ్నిపథ్ ను రద్దు చేస్తామన్నారు.

== మోదీ 2024లో నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీకి.. : సీఎం కేసీఆర్‌

బీజేపీ చెప్పే నీతి సోషలైజ్‌ ది లాసెస్‌.. ప్రైవేటైజ్‌ది ప్రాఫిట్‌ అని, దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం బీజేపీ అంటూ కేసీఆర్‌ విమర్శించారు. మోదీ పాలసీ ప్రైవేటైజేషన్‌ అయితే.. మా పాలసీ నేషనలైజేషన్‌ అని కేసీఆర్‌ అన్నారు.

‘మోదీ ఎల్‌ఐసీ అమ్ముతా అని అంటున్నవ్‌.. అమ్మేయ్‌ పర్వా లేదు. 2024 తర్వాత నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీకి.. గ్యారంటీగా ఎల్‌ఐసీ, పబ్లిక్‌ సెక్టార్లను వాపస్‌ తీసుకుంటాం. ఎల్‌ఐసీ సోదరులకు 42లక్షల కోట్ల ఆస్తులు ఉన్నయ్‌. లక్షలాది మంది ఏజెంట్లు, ఉద్యోగులు ఉన్నారు. భారతీయుల ఆత్మతోని, ప్రతి సామాన్యుడి కుటుంబంతోని పెనవేసుకొనిపోయిన పేగుబంధం ఉన్న సంస్థ ఎల్‌ఐసీ. అప్పనంగా, వడ్డీకి పావుషేరు ఇష్టం వచ్చిన షావుకార్లకు అమ్ముతామని ఉవ్విళ్లూరుతున్నవ్‌.. మళ్లీ వాపస్‌ తీసుకుంటాం. ఎల్‌ఐసీ కార్మికులు, మిత్రులు సింహంల్లా గర్జించండి. బీఆర్‌ఎస్‌ను బలపరచండి.. ఎల్‌ఐసీని రక్షించుకుందాం’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

== ప్రైవేటుకు అప్పనంగా అమ్ముతామంటున్నరు..

‘స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాక లక్షల కోట్ల జెన్‌కో, ట్రాన్స్‌కో ఆస్తులు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నయ్‌. అవి ప్రజల ఆస్తులు. అప్పనంగా లాస్‌ చూపించి షావుకార్లకు అప్పజెప్పి ప్రజల ముక్ముపిండి దాన్ని ప్రైవేటు చేసి అప్పనంగా అమ్ముతాముంటున్నారు. భారతదేశంలాంటి పెద్ద దేశంలో కరెంటు ముఖ్యమైన విషయం కాబట్టి, ప్రగతి సూచికల్లో మొదటిది కాబట్టి.. కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్‌ సెక్టార్‌లోనే ఉంచుతాం.. ఇదే బీఆర్‌ఎస్‌ పాలసీ.. కరెంటు కార్మికులారా.. పిడికిలి బిగించాలి’ అన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో రెండవ విడుత కంటి వెలుగు షురూ..

ఇక మాట్లాడమంటే రేకుడబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లే లోడాలడ మాట్లాడుతరు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిండా నీళ్లున్నా.. మంచినీళ్లివ్వలేని అసమర్థ పాలకులు కావాలా? ఇంకా చాలదా? మనకు సిగ్గు రావాద్దా..? కరెంటు ఇవ్వరు.. నీళ్లు ఇవ్వరు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి’ అని ప్రశ్నించారు. ‘కరెంటుకు లక్షల మెగావాట్లకు అవకాశం ఉంది. దేశంలో కోసి, గండకీ నదులు బిహార్‌ను కరువులు, వరదలతో ముంచెత్తుతున్నయ్‌. ప్రతి సంవత్సరం సగం బిహార్‌ వరదలు, సగం బిహార్‌ కరువు. హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ పెడితే అద్భుతమైన కరెంటు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలను మోసం చేసేందుకు, గోల్‌మాల్‌ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

== భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా..? – సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ జాతీయ పాలసీ, వైఖరి సమగ్రంగా వెల్లడిస్తాం. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా..? అంటూ ప్రశ్నించారు. లక్షల కోట్ల ఆస్తి మన దేశం సొత్తు.. కానీ ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండిపోయాం..? ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతం అని అన్నారు.

== దేశంలో పిజ్జాలు.. బర్గర్లు తినాలా..?

‘అమెరికాలోమనకంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుంది. వారికి ఉన్న 29శాతమే. చైనా మనకన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉంటుంది. వ్యవసాయభూమి 16శాతం మాత్రమే. భారతదేశ భూభాగం ఎకరాల్లో 83కోట్ల ఎకరాలు. ఇందులో సరాసరి సగం 41కోట్ల ఎకరాలు సాగుకు అనుకూల భూమి ఉంది. అపారమైన జలసంపద కురిసే వర్షపాతం 1.40లక్షల టీఎంసీలు. ఇందులో 75శాతం ఆవిరైపోతే.. మనం ఉపయోగించుకోగలగే నీరు 75వేల టీఎంసీలు. భూమి, నీరుంది. పంటలు పండేందుకు అద్భుతమైన సూర్యరశ్మి ఉంది. భారతదేశంలో ఆపిల్‌ పండుతుంది. మామిడి పండ్లు పండుతాయి. కష్టించి పని చేసే జాతిరత్నాలు జనాభా ఉన్నది. ఇన్ని కలిగి ఉన్న దేశంలో పిజ్జాలు, బర్గర్లా మనం తినేది. అద్భుతమైన పంటలు పండించి, సాగునీరు పైకి తెచ్చి దానికి అనుగుణంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలు పెట్టి.. కోట్లాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది. బెస్ట్‌ ఫుడ్‌ ఆఫ్‌ చైన్‌గా ఉండాల్సిన దేశం.. కెనడా నుంచి కంది పప్పు దిగుమతిచేసుకుంటుందా? ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? లక్షల కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటామా?’ అంటూ మండిపడ్డారు.

== ప్రజలను గోల్‌మాల్‌ చేస్తున్నరు

‘దేశంలో 75వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే ఈ రోజు ఎత్తుకొని వాడుకుంటున్నది 19, 20వేల టీఎంసీలే. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కోట్లాది మందికి విషపు మంచినీళ్లా గతి. దీనికి ఎవరు దీనికి బాధ్యులు. ఎవరీ పాపాత్ములు. అందుకే అడిగా భారతదేశానికి లక్ష్యం ఉందా? అని. లక్ష్యం కోల్పోయాం. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్పా.. తర్వాత అతీగతి లేదు. మన రాష్ట్రంలోనే బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ వేశారు. 19 సంవత్సరాలు గడిచిపోయాయి. హరీ లేదు శివా లేదు. 20 సంవత్సరాలు దాటినా.. ట్రిబ్యునల్‌ ఉలూపలుకు లేకపోతే.. తీర్పు చెప్పుడెప్పుడు.. ఆ తర్వాత డిజైన్లు అయ్యేదెప్పుడు.. ప్రాజెక్టులు కట్టేతెప్పుడు? ప్రజలకు సాగునీరు, తాగునీరు వచ్చేదెప్పుడు. దీనికేమైనా అంతర్జాతీయ రాజనీతి కావాలా? ప్రపంచబ్యాంకు వద్ద చిప్ప పట్టుకోవాలా? అవసరం లేదు కదా? ఇది నిజం కాదా? నీళ్లివ్వ చాత కాదు.. నదుల్లోని నీరు సముద్రంలోకి వెళితే నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ప్రజలను గోల్‌మాల్‌ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ  కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పిజరయ విజయన్, ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవాన్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదిపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రులు,