Telugu News

సర్కార్ బడులకు మోక్షం.. ఇక నుంచి ఇంగ్లీషు పాఠాలు

= పాఠశాలల బలోపేతానికి సర్కార్ నిర్ణయం

0

సర్కార్ బడులకు మోక్షం.. ఇక నుంచి ఇంగ్లీషు పాఠాలు
== పాఠశాలల బలోపేతానికి సర్కార్ నిర్ణయం
== పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియం ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌
== ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం
== కేటినేట్‌లో సుదీర్ఘంగా చర్చించిన కేబినేట్‌
== మంత్రి సబిత నేతృత్వంలో కేబినేట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు
== ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంట నష్ట ప్రాంతాల్లో నేడు కెసిఆర్‌ పరిశీలన
(హైదరాబాద్‌ -విజయంన్యూస్)
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో …మన ఊరు` మన బడి ప్రణాళిక కోసం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినేట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాల విద్య బలోపేతం కోసం సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో కేబినేట్‌ సబ్‌కమిటీ వేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రైవేట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియంలో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని కేబినెట్‌ నిర్ణయించింది.

also read;-సమంతకు బంపర్‌ ఆఫర్‌!

ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన…మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి , పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కేటిఆర్‌లు ఈ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది.తెలంగాణలో విద్యా విధానంపై కొత్త చట్టం తీసుకుని రావాలని కేబినెట్‌ సమావేశం నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు..

also read;-కిష్టాపురంలో సీసీ కెమోరాలను పునరుద్ధరణ చేయించిన సీఐ సతీష్

ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచారు. ఇదిలావుంటే అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ మంగళవారం పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు పర్యటనలో పాల్గొననున్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందని మంత్రిమండలికి అధికారులు వెల్లడిరచారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ఆలస్యమైందని వివరించారు. ధాన్యం పూర్తిగా కొనే వరకు కేంద్రాల కొనసాగించాలని కేబినెట్‌ ఆదేశించింది.

also read;-ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళల పై దాడి

ఇటీవల వరంగల్‌ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన వల్ల పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో పడిన వర్షం వల్ల జిల్లాలో మిర్చి, మొక్క జొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. వడగళ్ల కారణంగా మక్క చెట్లు సగానికి విరిగి నేలకొరిగాయి. మిరప చెట్ల నుంచి మిర్చి మొత్తం నేలరాలింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోనూ సుమారు 500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిరపకాయలు రాలి వరదలో కొట్టుకుపోయాయి. చిట్యాల, టేకుమట్ల, మహదేవపూర్‌, మొగుళ్లపల్లి తదితర మండలాల్లో కోసి ఆరబోసిన మిర్చి కూడా తడిచింది. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. రైతులతో మాట్లాడి… తగిన భరోసా ఇవ్వనున్నారు.