కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ పాఠశాల అభివృద్ధి: సండ్ర
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన నాణ్యమైన విద్య
ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా చర్య5తీసుకుంటున్నదని అన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి, పాఠశాలలను ప్రయివేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అన్ని సౌకర్యాలతో ప్రయివేటు ను మించి మంచి వాతావరణం కలిగి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, పీఆర్ ఇఇ చంద్రమౌళి, ఎంఇఓ వెంకటేశ్వరరావు, పెనుబల్లి ఎంపిపి లక్కినేని ఆలేఖ్య, చింతగూడెం గ్రామ సర్పంచ్ నాగదాసు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


