Telugu News

గైగొళ్లపల్లికే వన్నె తెచ్చిన సర్పంచ్

== అభివృద్ధిపథంలో ఆ ఊరు.. == గుట్టను తవ్వి.. వైకుంఠదామంగా మార్చి == వాగులో నడిచే తిప్పలను తప్పించిన మొదటి పౌరుడు == నిరుపేదలకు అసరగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు == ఊరు చుట్టూ రహధారులు.. అంతర్గత రోడ్లు == అడుగడుగున వీధిలైట్లు.. == చెరువుల నిండా భక్తరామదాసు నీళ్ళు

0

గైగొళ్లపల్లికే వన్నె తెచ్చిన సర్పంచ్
== అభివృద్ధిపథంలో ఆ ఊరు..
== గుట్టను తవ్వి.. వైకుంఠదామంగా మార్చి
== వాగులో నడిచే తిప్పలను తప్పించిన మొదటి పౌరుడు
== నిరుపేదలకు అసరగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
== ఊరు చుట్టూ రహధారులు.. అంతర్గత రోడ్లు
== అడుగడుగున వీధిలైట్లు..
== చెరువుల నిండా భక్తరామదాసు నీళ్ళు

(కూసుమంచి – విజయంన్యూస్):-
అత్యంత మూరుమూల గ్రామం.. అది కాస్త అత్యంత కరువు ప్రాంతం.. మెట్టభూములు తప్ప మాగాణి కనిపించని ఊరు.. మట్టి రోడ్లే దర్శనం.. ఒక్క ప్రధాన రహదారి ఉన్న కనుచూపు మేర గుంతల మయం..బతికి ఉన్నంతకాలం కష్టపడిన మనిషి, చచ్చిపోయినతరువాత ఆయన్ను ఖననం చేయాలంటే నరకమే.. మోకాళ్లలోతు నీళ్లు.. వరినాట్లలో అడుగులో అడుగేస్తు శవాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు చేసుకునే పరిస్థితి..అలాంటి దుర్భర జీవనం సాగించిన ఆ గ్రామం నేడు అందమైన గ్రామంగా మారింది.. కనులవిందుగా వృక్షాలు.. కమ్మనైన పల్లెపకృతి వనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో అభివృద్ధి పలాలు ఆ ఊరి స్వంతం.. మారుమూల ప్రాంతంలో వెలివేయబడినట్లుగా ఉండి, అభివృద్ధికి అమడ దూరంలో అత్యంత కరువు ప్రాంతంగా ఉన్న ఆఊరిలో ఇప్పుడు సిరివెలుగులు వెలుగుతోంది..

ఊరిచుట్టూ రహదారులు.. మళ్ల నిండా పుష్కల జలం.. రెండు పంటల సాగు.. అధిక దిగుబడి.. అన్నింటికి ఆయనే వారథి.. గత 8ఏళ్ల క్రితం కరువు ప్రాంతంగా ఉన్న ఆ ఊరు ఇప్పుడు అభివృద్ది చెందిన గ్రామ పంచాయతీల్లో ఒక్కటిగా మారింది..ఆ ఊరు పేరేంటో…ఏ స్థాయిలో అభివద్ది చెందిందో..? చూడాలనుకుంటే సర్పంచులగా ఎన్నికై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘విజయం’ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం పూర్తిగా చదవండి..

also read :- ఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి.
కూసుమంచి మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే అత్యంత మూరుమూల గ్రామం గైగొళ్లపల్లి. గతంలో రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేని పల్లె. ఆ గ్రామ పంచాయతీ పరిధిలో వాల్యతండా, చింతలతండా, ఉడతలగూడెం గ్రామాలున్నాయి. మొత్తం 1806 మంది జనాభ కల్గిన ఈ గ్రామం గత 10 ఏళ్ల క్రితం అత్యంత కరువు ప్రాంతంగా విరాజిల్లేది. వర్షాలు వస్తే తప్ప సాగులోకి రాని భూములు, వర్షాలు రాకపోతే బీటలు వారే సెలయేరులు.. గైగొళ్లపల్లి-బోడియతండా రహదారి మినహా ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. ఆర్టీసీ బస్సు ఉన్నప్పటికి రోజుకు ఒక్కసారైనా వచ్చేది కాదు ఆటోలకే పరిమితమైయ్యేవారు.

అలాంటి గైగొళ్లపల్లి గ్రామాన్ని అభివద్ధి పథంలోకి తీసుకెళ్లారు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ముల్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి. గ్రామస్థుల సహాకారం, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ సహాకారం, అధికారుల పర్యవేక్షణలో అభివద్ది పథంలో ఆ గ్రామాన్ని తీర్చిదిద్దారు. 2016లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్య ముల్కూరి మౌనిక సర్పంచ్ గా విజయం సాధించగా, ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అనేక పనులు చేయించారు. కరువు ప్రాంతంగా విరాజిల్లుతున్న ఈ క్రమానికి భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా పైప్ లైన్ వేయించుకుని నీటి వసతిని తీసుకొచ్చారు. భక్తరామదాసు ప్రాజెక్టునిర్మాణంలో గైగొళ్లపల్లి గ్రామ పంచాయతీ రికార్డులో లేదు.

కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఒప్పించిన సర్పంచ్, ప్రత్యేకంగా పైప్ లైన్ వేయించారు. దీంతో పుష్కలంగా నీళ్లు వస్తుండటంతో చెరువుల నిండా నీళ్లు ఉంటున్నాయి. ఫలితంగా ప్రతి ఏడాది రెండు పంటలను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో బీటలు వారిన పంట భూములు కాస్తా నేడు మాగాణి భూములుగా మారిపోయాయి. మాగాణి భూములలో కూడా అరుతడి పంటలను సాగు చేసే రైతులు ఇప్పుడు రెండు పంటల్లో మాగాణి పంటలను సాగు చేస్తున్నారంటే అందులో సర్పంచ్ ముల్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి పాత్ర చెప్పలేనిది.
== గట్టను తవ్వి.. వైకుంఠదామం కట్టి

also read :- రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు – జిల్లా కిసాన్ కాంగ్రెస్
గైగొళ్లపల్లి గ్రామంలో మనుషులు చనిపోతే ఖననం చేసేందుకు ప్రత్యేక శ్మశానవాటిక లేదు. చనిపోయినవారిని వానాకాలం అక్కడికి తీసుకెళ్లాలంటే నరకం కనిపించేది. మోకాళ్లలోతు నీళ్లు కల్గిన వాగులో, మడికట్లలో బురదలో నడుచుకుంటూ మనుషులను ఖననం చేసేవారు. సర్పంచ్ ముల్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి స్పందించారు. వైకుంఠదామం నిర్మాణం కోసం ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం వైకుంఠధామాలను మంజూరు చేయడంతో అందుబాటులో ప్రభుత్వ స్థలం లేదు.

కానీ రెవెన్యూ అధికారులు పెద్ద గుట్టను ఖాళీస్థలంగా చూపించారు. దీంతో సర్పంచ్ ఆ గుట్టను తవ్వించాడు. సదును చేశాడు. అందుకు రూ.5లక్షలను ఖర్చు చేశాడు. అనంతరం అందమైన వైకుంఠధామంను నిర్మాణం చేసి విమ్మర్శులతో కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆ సమీపంలోనే మరికొంత స్థలాన్ని సదును చేసి డంఫింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసి గుట్టను సైతం అందమైన పార్కుగా మార్చేశాడు.
== కనివిందు చేసే పల్లెప్రకతి వనం.. అందాలను చూపిస్తున్న వెవెన్యూ ప్లాంటేషన్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పల్లెప్రకతి వనం, హరితహారం కార్యక్రమాన్ని సర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి అద్భుతంగా మల్చుకున్నాడు. అత్యంత కరువు ప్రాంతంగా ఉండి ఏడారిగా ఉండే ఆ ఊరిలో అద్భుతమైన మొక్కలను నాటారు వాటిని సంరక్షించారు. అవి ఇప్పుడు అద్భుతంగా ఊరికే అందాన్నిస్తున్నాయి. అలాగే పల్లెప్రకతి వనం అద్భుతంగా కనులువింధుగా ఉంది. మొక్కలు వనాలుగా మారి చూపరులను అకట్టుకుంటున్నాయి.

ఇక రైతు వేదికను అద్భుతంగా నిర్మాణం చేయించారు. ప్రభుత్వం రూ.22లక్షలు నిధులను మంజూరు చేసినప్పటికి ఎత్తైన ప్రాంతంలో నిర్మాణం చేసి అద్భుతంగా తయారు చేశారు. చుట్టు ప్రకతి వనం, అహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేశారు. ఇక అందమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం చేశారు. అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కురుస్తుంటే గైగొళ్లపల్లి గ్రామంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు లేవు. దగ్గరుండి సర్పంచ్ పర్యవేక్షణలో నిర్మాణం జరిగాయి. 18 ఇండ్లు నిర్మాణం చేయగా, ఆ ఇండ్లలోకి లబ్ధదారులకు కేటాయించగా, గత రెండేళ్ల క్రితమే ఆ ఇండ్లలోకి వెళ్లి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికి చాలా గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ప్రారంభించని దాఖలాలు అనేకం.

also read :-కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి
== రూ.18 కోట్ల నిధులు.. ఊరి చుట్టూ బీటీ రోడ్లు.. ఊళ్లో సీసీ రోడ్లు
గైగొళ్లపల్లి గ్రామంలో గడిచిన ఐదేళ్లలో రూ.5కోట్లతో అభివద్ధి పనులు జరిగాయి. అడుగడుగున బీటీ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మాణం చేశారు. నర్సింహులగూడెం నుంచి గైగొళ్లపల్లి వరకు రూ.2.25కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేయగా, ఉడతలగూడెం నుంచి చింతలతండా, వయా హట్యతండా వరకు ప్రస్తుతం రూ.1.01కోట్లతో బీటీ రోడ్డు గత హాయంలో నిర్మాణం కాగా, ప్రస్తుతం రూ.1.26 కోట్ల నిధులతో లింక్ రోడ్లు నిర్మాణం చేశారు. అలాగే బోడియతండా నుంచి గైగొళ్లపల్లి, లాల్ సింగ్ తండా, సంధ్యతండా మీదగా తిరుమలాయపాలెం మండలంలోని రాజారం, జూపేడ వరకు రూ.10కోట్ల నిధులతో డబుల్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఎస్సీ కాలనీలో ఎస్టీ,ఎస్టీ సబ్ ప్లాన్ రూ.20లక్ష్లతో సీసీ రోడ్లు, రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేశారు. అలాగే రూ.98 లక్షలతో 18 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రూ.22 లక్షలతో రైతువేదిక, రూ.1.10కోట్లతో మిషన్ భగీరథ ఆరు వాటర్ ట్యాంకులను నిర్మాణం చేశారు. రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.4లక్షలతో ప్రకృతి వనం, రూ.2లక్షలతో డంఫింగ్ యార్డ్ లను నిర్మాణం చేశారు. పంచాయతీ నిధులతో వెవెన్యూ ప్లాంటేషన్ నిర్మాణం చేశారు. అంగన్ వాడీ కేంద్రాలను రూ.24లక్షలతో అంగన్ వాడీ కేంద్రాలను నిర్మాణం చేసి గైగొళ్ల గ్రామ పంచాయతీని అభివద్ది కల్గిన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దారు. దీంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాలన పట్ల పలువురు కొనియాడుతున్నారు.
== అభివద్ధి కోసం చాలా కష్టపడ్డాను : ముల్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి, సర్పంచ్, గైగొళ్లపల్లి.


గైగొళ్లపల్లి లో గత ఐదేళ్లు నా భార్య మౌనిక సర్పంచ్ గా చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో నేను సర్పంచ్ గా ఎన్నికైయ్యాను. ఈ ఎనిమిదేళ్ల కాలంలో గైగొళ్లపల్లి రూపురేఖలను మార్చేశాను అని చెప్పేందుకే సంతోషిస్తున్నాను. గతపదేళ్ల క్రితం గైగొళ్లపల్లి మూరుమూల కరువు ప్రాంతంగా ఉండేది. పంట భూములు బీటలు వారిన బీడు భూములుగా ఉండేవి. కానీ భక్తరామదాసు నీళ్లను తీసుకొచ్చేందుకు ఆనాటి మంత్రిని బ్రతిమిలాడి తెప్పించాను. అందుకు ప్రజల సహాకారం బాగుంది. అలాగే సుమారు గైగొళ్లపల్లికి రూ.18 కోట్ల వరకు నిధులు వచ్చే విధంగా కష్టపడ్డాను. వైకుంఠధామం కోసం పెద్దగుట్టను తవ్వాల్సి వచ్చింది. అందుకు చాలా కష్టపడ్డాము. మా ఊరి అభివృధ్ధికి అధికారులతో పాటు వార్డు సభ్యులు, ఉపసర్పంచ్, గ్రామస్థులు సహాకరించారు. వారందరికి నా ధన్యవాదాలు. మరో రెండేళ్లలో మరింతగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తాను.

also read :-  బూడిదంపాడు గ్రామంలో నామ పర్యటన