Telugu News

రుద్రాక్షపల్లి లో డెంగ్యూ కలకలం..

యువకుడు మృతి..అధికారులపై మండిపడిన కాంగ్రెస్ నేత

0

*సత్తుపల్లి రుద్రాక్షపల్లి లో డెంగ్యూ మరణం*

*ప్రభుత్వ వైద్య అధికారుల పై మండిపడ్డ మానవతారాయ్*

(రిపోర్టర్-సురేష్ బాబు)

సత్తుపల్లి, ఆగస్టు 3(విజయంన్యూస్)
సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామపంచాయతి కి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నాయక్ పోడ్ రాజిన్ని నాగరాజు (19) అనే యువకుడు నిన్న సాయంత్రం డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు.ఈ విషయం తెలుకున్న టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ హుటాహుటిన బుధవారం ఉదయం రుద్రాక్షపల్లి వెళ్ళి రాజిన్ని నాగరాజు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Allaso read:- బైక్ అదుపు తప్పింది.. రోడ్డుపక్కనే ఉన్న రాయిని ఢీకొట్టింది

‌ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం లో వర్షాకాల సీజన్ ప్రారంభం కావటంతో పలు వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందితున్నా వైద్యాధికారులు మరియు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.వైద్య అధికారులు వెంటనే రుద్రాక్షపల్లి ని సందర్శించి ప్రజలకు రక్త, వైద్య పరీక్షలు నిర్వహించేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.పంచాయతీ లో మరియు ఎస్సీ/ఎస్టీ కాలనీలో బ్లీచింగ్ చల్లి పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు‌.నాగరాజు మరణం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిందని టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే డెంగ్యూ తో మరణించిన నాగరాజు కుటుంబానికి 10లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి సొసైటీ వైస్ ఛైర్మన్ గాదె చెన్నకేశవరావు,సత్తుపల్లి మాజీ ఎంపిటిసి ఐ కృష్ణ,సత్తుపల్లి మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఫజల్ బాబ,గోవర్థన్,వెంకటేశ్వరరావు తదితరులు పరామర్శించారు.

Allso read:- దైవ దర్శనానికి వెళ్లి.. కాలుజారీ.