సూపర్ స్టార్ కృష్ణ మృతి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్ర సంతాపం
కుటుంబానికి సానుభూతి తెలిపిన సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు
కృష్ణ మృతి పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే సంతాపం
కుటుంబానికి సానుభూతి తెలిపిన సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు
(ఖమ్మం-విజయంన్యూస్)
సినీ వినీలాకాశంలో మరో ధృవ తారా దివికేగారు. సినీ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా. నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలు ఎంతో స్ఫూర్తి దాయకమని వెంకట వీరయ్య స్మరించుకున్నారు.
Allso read-సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు. *కృష్ణ కుటుంబ సభ్యులకు, ప్రేక్షక అభిమానులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.*
**సూపర్ స్టార్ కృష్ణ మృతికి : టిఆర్ఎస్ కల్లూరు మండల పార్టీ తీవ్ర సంతాపం**
సినీ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల టిఆర్ఎస్ కల్లూరు మండల పార్టీ తీవ్ర సంతాపం, కుటుంబ సభ్యులకు, కృష్ణ ప్రేక్షక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు
ఇది కూడా చదవండి:- సినిహీరో కృష్ణ మృతి పట్ల సీఎం సంతాపం