Telugu News

పత్రాలేందుకు..? పైసలీవ్వూ..?

ముత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద పైసల వసూళ్లు..?

0

పత్రాలేందుకు..? పైసలీవ్వూ..?

== ముత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద పైసల వసూళ్లు..?

== ఎన్నో ఏళ్ల నుంచి మస్తుగా నడుస్తున్న దందా..?

== ‘విజయం’ నిఘాకు చిక్కిన కొన్ని ఆధారాలు

== ఆరోపణలు వినిపిస్తున్న పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్న జిల్లా అధికారులు

(విజయంన్యూస్- నిఘావిభాగం)

అది రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్.. అక్కడ నుంచి మస్తుగా లారీలు హెవీలోడెడ్ తో వెళ్తుంటాయి.. ఈ క్రమంలో చెక్ పోస్ట్ వద్ద అధికారులు, ఉద్యోగులు వాహనాలను తనిఖీలు చేసి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయాల్సి ఉంటుంది.. కానీ అక్కడదేమి లేదంటా..? పత్రాలు లేకపోయిన సరే..పైసలుంటే చాలంటున్నరు అక్కడ జనం.. ఎన్నో ఏళ్ల సంది ఈ బాగోతం నడుస్తుందంటా..? అక్కడ మంది మస్తుగా చెబుతున్నరు..? పోయినేడాది కూడా గిట్లనే ఆరోపణలోచ్చినయంటా..? అయినప్పటికి ఏ ఒక్కళ్లు పట్టించుకోలేదంటా..? కనీసం గటు చూసిన దాఖలాలు లేవంటా..?

allso read- “దళితబంధు” రాజకీయ ఎత్తుగడేనా..?

మస్తుగా దందా చేస్తన్నరు అంటూ ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి ఏర్పడింది.. గేవలైనా విలేకర్లు.. రాజకీయ నాయకుళ్లు.. ప్రజాప్రతినిధులు అడిగితే చేతిలో గవ్వలు పెట్టి నోరు మూపిస్తున్నరంటా..? దీంతో విజయం దినపత్రిక టీమ్, విజయం టీవీ బృందం రంగంలోకి దిగింది.. అక్కడ నిఘా వేసింది.. దీంతో అసలు నిజం బయటపడింది.. లారీలు ఆపిన డ్రైవర్లు కాగితాలు కాకుండా కాసులు తీసుకపోతున్న పోటోలను విజయం క్లిక్ మనిపించింది. అసలు అక్కడేం జరుగుతుందో..? ఒక సారి చూద్దామా..?

ఖమ్మం జిల్లా..పెనుబల్లి మండలం.. ముత్తగూడెం గ్రామ.. సరిహద్దున తెలంగాణ రాష్ట్ర అతి ముఖ్యమైన సరిహద్దున ఆర్టీఏ తనిఖీ కేంద్రంలో. కాసుల పరంపర కొనసాగుతూనే ఉంది.. నిత్యం వేలాది లారీలతో,  ట్రక్కులతో హెవీ లోడెడ్ వెహికల్స్, తెలంగాణ నుంచి ఏపీలోకి వెళుతుంటాయి. అంతర్ రాష్ట్రా రవాణా వాహనాలన్ని ఇటువైపు నుంచే వెళ్తుంటాయి.. చేపలు, ధాన్యం, ఇనుప,ఇసుక ఇటువైపు నుంచి వెళ్తుంటాయి.. అత్యధిక ఆదాయం వచ్చే చెక్ పోస్ట్ కూడా ఇదే.. ఇతర రాష్ట్రాలకు రవాణా జరిగే సరిహద్దు చెక్ పోస్టు ఇది. ప్రభుత్వ అనుమతి ఉన్నవి, అనుమతి లేనివి, ఇతర అక్రమ రవాణా అంతా ఇటువైపు నుంచే కొనసాగుతుంటాయనే ప్రచారం జరుగుతుంది. ఇదే అక్కడ ఆర్టీఏ కేంద్రంలో ఉన్న అధికారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.. పైసలుంటే చాలు కాగితాలు మాకొద్దు అర నిమిషంలో ఆర్టీఏ చెక్ పోస్ట్ దాటిస్తున్న అధికారులు.. ఇన్ని సంవత్సరాలైనా పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం..? ఎందుకిలా జరుగుతుంది అని అడగ్గా..అక్కడున్న వారు? ఎవరికి వెళ్లాల్సింది వాళ్ళకి వెళుతుంది, ఇంకా ఎవరికి భయపడాలి అన్నట్లుగా దబాయిస్తున్నరు.

allso read- దండెంపై బట్టలారేయపోయి విద్యాఘాతంతో మహిళ మృతి

కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి మస్తు పైసలు పంపిస్తున్నమన్నట్లు మాట్లాడుతున్నరంటా..? తెలంగాణ ఆర్టీఏ తనిఖీ కేంద్రంలో ఇంత దర్జాగా అవినీతి జరుగుతున్న, స్థానికులు, ప్రజలు ఆరోపిస్తున్న పట్టించుకునే నాథుడే కరువైయ్యారు. మినిమం జీఎస్టీ తరహాలో డబ్బులు వసూల్ కి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది..  ఎందుకు పట్టించుకోవడం లేదు.. ఇందులో ఎవరి పాత్ర ఎంత.. తనిఖీ చేసేది ఎప్పుడు అనేది అర్థం కాని పరిస్థితి. ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు చోద్యం చూస్తున్నారంటూ  స్థానికులు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. మరీ ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా..? వేచి చూద్దాం.