Telugu News

సండ్ర నీ తీరు మార్చుకో..సండ్ర పై స్వంతపార్టీ నేతల ఫైర్

తల్లాడ టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గపోరు

0

సండ్ర నీ తీరు మార్చుకో..

** సండ్ర పై స్వంతపార్టీ నేతల ఫైర్

** పద్దతి మార్చుకోకపోతే తప్పక ఓడిస్తాం

** సత్తుపల్లి ఎమ్మెల్యే వైఖరి పై ఆ నాయకులు ఆగ్రహం..

** తల్లాడ టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గపోరు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

సత్తుపల్లి నియోజకవర్గ అధికారపార్టీలో వర్గపోరు భగ్గుమన్నది.. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న టీఆర్ఎస్ నేతలు ఒక్కసరిగా బహిరంగంగా వర్గపోరును వ్యక్తం చేస్తూ బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు.. సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య పై ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు.. తన పద్దతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెబుతామని తల్లాడ కు
తెరాస పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఆవిర్భావం నుంచి ఎంతో మంది నేతలం నేటికి ఇదే పార్టీలో కొనసాగుతున్నామని బువ్వ పెట్టిన పార్టీలు, నమ్మి గెలిపించిన పార్టీ నేతలను నమ్మించి మోసం చేశావు.. మేము పార్టీలు మారే రకం కాదు.. అంగబలం.. అర్ధబలం కోసం కాకుండా ప్రజాశేయస్సే ధ్యేయంగా మేము పనిచేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. తల్లాడలో కావాలనేకొంత మంది. సొంత ప్రయోజనాల కోసం పార్టీలో చేరి ఇందులో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారి పై కక్ష సాధింపు చర్యలకు దిగితున్నారని ఆరోపించారు. ఈ పద్దతి సరికాదని తెల్చి చెప్పారు.. ఇప్పటికైనా నీ తీరు మార్చుకో.. లేకుంటే రాబోవు ఎన్నికల్లో నీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని తల్లాడ మండలానికి చెందిన పలువురు నాయకులు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య కు హెచ్చరికలు జారీ చేశారు. గత కొంతకాలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఆదివారం తల్లాడ మండలంలోని కలకొడిమ గ్రామంలో వేరే వర్గీయులు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.

allso read:- తెలంగాణ ప్రజల ఆత్మబంధువు కేసిఆర్ : మంత్రి అజయ్ కుమార్

ఈ సమావేశంలో సండ్ర వ్యవహారశైలీపై చర్చించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన పలువురు నేతలు మాట్లాడుతూ.. సత్తుపల్లి ఎమ్మెల్యే గా కొనసాగుతున్న సండ్ర వెంకటవీరయ్య టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కొంతకాలానికి అధికార పార్టీ తెరాసలోకి కేసీఆర్ సమక్షంలో చేరారు. ఆ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేశాం. ప్రస్తుతం ఆయన తెరాస పార్టీలో కొనసాగుతుండటంతో సొంతపార్టీ ఎమ్మెల్యేగానే భావించి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం తో పాటు ఆయనకు అనుకూలంగానే మేము కొనసాగుతూ వస్తున్నాం. కానీ ఆయనే 2018 ఎన్నికల నాటి అంశాలను ఇంకా మనస్సులో పెట్టుకుని మాపై అనవసర కక్షలకు దిగుతున్నారు. సండ్ర కంటే ముందు నుంచే మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నామనే విషయాన్ని సండ్ర మర్చిపోయినట్లున్నారు. మండల, జిల్లా నాయకులుగా మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రజాప్రతినిధిగా అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉండాలి. అలా కాకుండా సండ్ర వర్గాలను ప్రోత్సాహించే పనిలో ఉన్నారు. తీరు మారకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేయడమే కాకుండా రాబోవు ఎన్నికల్లో కచ్చితంగా ఆయన ఓటమే ధ్యేయంగా మేమంతా పనిచేస్తామని తీర్మానం ప్రకటిస్తున్నాం.ఈ
సమావేశంలో జక్కంపూడి కృష్ణమూర్తి, గుండేటి వీరారెడ్డి, దిరిశాల నరసింహారావు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు,

allso read:- రైతు బంధు రైతులను ముంచే పథకం

కె వి, రేజర్ల ఎంపీటీసీ కొమ్మినేని ప్రభాకర్ రావు, కలకొడిమ సర్పంచ్ ఆదూరు ఏసు, పినపాక మాజీ సర్పంచ్ నర్వనేని లక్ష్మణరావు, కొత్త వెంకటగిరి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ నీటి సంఘం అధ్యక్షులు అనుమోలు బుద్ధి సాగర్, కొట్టేటి బ్రహ్మారెడ్డి, తుమ్మలపల్లి రమేష్, తూము వెంకటనారాయణ, కేశవ రెడ్డి, మల్లవరం ఉప సర్పంచ్ ఎర్రి నరసింహారావు, బసవపురం మాజీ సర్పంచ్ వెంకట మైబు, పోతురాజు కోటయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గణేషుల రవి, లక్ష్మీనారాయణ, తల్లాడ సొసైటీ డైరెక్టర్ అనంత రాములు, దీవెన రామకృష్ణ, ఏరువ గోపాల్ రావు, పొన్నం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

§