Telugu News

నేడు సత్తుపల్లిలో ఎంపీలకు అభినందన సభ

రాజ్యసభ సభ్యుల అభినందన సభను విజయవంతం చేయండి.: సండ్ర

0
నేడు సత్తుపల్లిలో ఎంపీలకు అభినందన సభ
== ఖమ్మంలో ఘనస్వాగతం
== తల్లాడ నుంచి భారీ ర్యాలీ 
== రాజ్యసభ సభ్యుల అభినందన సభను విజయవంతం చేయండి.
== మీడియా సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు
(ఖమ్మం ప్రతినిధి -విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి, బండి పార్థ సారథి రెడ్డి లకు ఇటీవలే  రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి విచ్చేయుచున్న సంధర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. అందుకు ముందుగా ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం ఏర్పాట్లు చేశారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్ సమీపంలోని భోజనం విరామం అనంతరం భారీ ర్యాలీగా సత్తుపల్లి కి చేరుకోనున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం లోని తల్లాడ, కల్లూరు సత్తుపల్లి వరకు భారీగా స్వాగతం పలకనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరుకానున్నారు.
== అభినందన సభను జయప్రదం చేయండి : , ఎమ్మెల్యే సండ్ర  
 రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రకి అడుగడుగున సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ జన సందోహంతో, మోటార్ సైకిల్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికి, సత్తుపల్లిలో ఏర్పాటుచేసిన అభినందన సభను విజయవంతం చేయాలని, ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ సభ్యులను అవకాశం కల్పించి ఖమ్మం జిల్లా పై అభిమానాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా వాసులుగా కృతజ్ఞత తెలపాలని  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.గురువారం సత్తుపల్లిలోని స్థానిక క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటలకు తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామం లోని  జీఎన్ఆర్  గార్డెన్స్ వద్ద వారికి ఘన స్వాగతం పలకడం, అనంతరం తల్లాడ రింగ్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించి సభ జరుగుతుందని, అనంతరం 2 గంటలకు కల్లూరు మండల శివారు వద్ద ఘన స్వాగతం పలికి, కల్లూరు సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించి సభ జరుగుతుందని,
అదేవిధంగా 3 గంటలకు పెనుబల్లి మండల శివారు వద్ద ఘన స్వాగతం పలికి వియం బంజర వరకు రోడ్ షో నిర్వహించి రింగ్ సెటర్ వద్ద సభ ,అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో సత్తుపల్లికి విచ్చేస్తారని, సత్తుపల్లి పట్టణ శివారులో ఘన స్వాగతం పలకగా పట్టణంలో పాత సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి జేవిఆర్ కళాశాల ఆవరణంలో సాయంత్రం 4 గంటలకు అభినందన సభ నిర్వహిస్తున్నట్లు, సభ ప్రాంగణంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థల చైర్మన్ కళాకారుడు సాయి చాంద్ గారితో ధూమ్ ధాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. నియోజకవర్గంలోని నాయకత్వం రాజ్యసభ సభ్యులకు భారీ ఘన స్వాగతం పలకాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  పిలుపునిచ్చారు. 
అనంతరం 19వ తేదీ శనివారం రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి  సాయిస్ఫూర్తి కళాశాలలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణ, అనంతరం సత్తుపల్లిలోని పాత సెంటర్ ప్రభుత్వ యు.పి.ఎస్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రాంతవాసి రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డికి వేంసూరు మండల ప్రజలు పార్టీలకు అతీతంగా వేంసూరు మండలం మర్లపాడు గ్రామం వద్ద ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీతో స్వగ్రామమైన కందుకూరు గ్రామానికి స్వాగతం పలుకుతున్నట్లు, గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని పల్లె దవాఖాన ను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.

 

== రాజ్యసభ సభ్యులు అభినందన కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కదిలి వచ్చి విజయవంతం చేయాలి:తాతా మధు
ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో మరో ముందడుగు వేసే ధోరణిలో జిల్లాకు రెండు రాజ్యసభ సభ్యులను అవకాశం కల్పించడం ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బండి పార్థసారధి రెడ్డికి రాజ్యసభన సభ్యునిగా అవకాశం కల్పించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞత తెలుపుతూ  మొట్టమొదటిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డికి వద్దిరాజు రవిచంద్ర గారికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన అభినందన సభా కార్యక్రమంలో ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పాల్గొనాలని మీడియా సమావేశంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు అందరూ ఐక్యతగా కలిసి పని చేయుటకు సత్తుపల్లిలో నిర్వహించు అభినందన, కృతజ్ఞత సభ వేదికగా నిలుస్తుంది అన్నారు.
అనంతరం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుల అభినందన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞత సభ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.  అనంతరం అభినందన కృతజ్ఞత సభ నిర్వహించుటకు ఏర్పాటు చేసిన జేవియర్ కళాశాల ఆవరణలోని సభ స్థలంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మీడియా సమావేశంలో రైతుబంధు అద్యక్షులు  జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్, సత్తుపల్లి డిసిసిబి డైరెక్టర్ చల్లగుల్ల కృష్ణయ్య, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్  కూసంపూడి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, సత్తుపల్లి ఎంపిపి దొడ్డ హైమవతి శంకరరావు, జడ్పిటిసి కూసంపుడి రామారావు, కార్పొరేటర్ కామర్తపు మురళి, సత్తుపల్లి టౌన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, టౌన్ టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు వల్లభనేని పవన్,  కౌన్సిలర్లు మట్ట ప్రసాద్, చంద్ పాషా, అద్దంకి అనిల్, నాయకులు మమిల్లపల్లి కృష్ణయ్య, అమరవరపు కృష్ణా రావు, వేములపల్లి మధు, షేక్ అబ్దుల్లా, నడ్డి ఆనందరావు, కంటే అప్పరావు తదితులున్నారు.