ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోవాలి : హరీశ్ రావు
🔶 పార్టీలకతీతంగా సభను విజయవంతం చేయాలి : నామ
🔶ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోవాలి : హరీశ్ రావు
🔶 చరిత్రను తిరగ రాసేలా ఖమ్మం సభను
(ఖమ్మం, సత్తుపల్లి-విజయం న్యూస్)
విజయవంతం చేయాలని శుక్రవారం సత్తుపల్లిలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో పెద్ద ఎత్తున నిర్వహించిన సభ సన్నాహాక సమావేశం ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజా ప్రతినిధులకు పిలుపు నిచ్చింది..ఈ నెల 18 న ఖమ్మంలో భారీ ఎత్తున జరప తలపెట్టిన బీఆర్ఎస్ సభ విజయవంతానికి, భారీ జన సమీకరణకు నిర్ణయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తెలంగాణా అద్భుత ప్రగతితో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలన్నారు. ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్ర సృష్టిస్తుందన్నారు.
ఇది కూడ చదవండి:-అందరి చూపు ఆయన వైపే
దేశ చరిత్రలో లిఖించబడుతుందని అన్నారు. మహోధృతంగా భారీగా తరలి వచ్చి సత్తా సాటలన్నారు .ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ కరీంనగర్ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, తెలంగాణాను సాధించిపెట్టిందన్నారు. కొత్త ఊపును, ఊతాన్ని ఇచ్చిందన్నారు. అలాగే 18 న జరిగే ఖమ్మం సభ దేశానికి దిశ, దశను కలిగిస్తుందని పేర్కొన్నారు.ఖమ్మం సభ జాతీయ రాజకీయాలను మార్పు తెస్తుందన్నారు. నలుగురు సీఎంలు, సీపీఐ, సీపీఎంజాతీయ నేతలు పాల్గొనే ఖమ్మం భారీ బహిరంగ సభ ను చరిత్రలో నిలిచిపోయే విదంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి:- మేమే నెంబర్ వన్: సీఎం కేసీఆర్
కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ లు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవి చంద్ర, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సుదర్శన్ రెడ్డి ( నర్సంపేట ఎమ్మెల్యే ), రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,రాయల శేషగిరిరావు,కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేష్, కూసంపూడి నరసింహారావు, రామారావు, పొగట్ల వెంకటేశ్వరరావు, సుజలారాణి, భూపాల్ రెడ్డి, గొర్ల సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి,దొడ్డా హైమావతి, కాటంనేని వెంకటేశ్వరరావు, దిరిశాల ప్రమీల, ఇతర ముఖ్య నేతలు , తదితరులు పాల్గొన్నారు.
🔶సంక్రాంతి సంబరాల్లో నామ
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు తో కలసి ఎంపీ నామ నాగేశ్వరరావు గారు సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకున్నారు.భోగి మంటలు వేశారు.