సత్తుపల్లి టికెట్ మానవతారాయ్ కి కేటాయించాలి:ఓయూ జేఏసీ
== ఓయూ జేఏసీ నేతల డిమాండ్*
(ఓయూ హైదరాబాద్-విజయం న్యూస్)
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని జైలు జీవితం గడిపిన విద్యార్థినేత మానవతారాయ్ కి టిక్కెట్ కేటాయించాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి:- ఇల్లందులో ఆ పార్టీ విజయం తథ్యం: జోస్యం చెప్పిన ఎంపీ
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వంపై విద్యార్థి,నిరుద్యోగుల గొంతుకై కొట్లాడి పలుమార్లు జైలుకెళ్లి విద్యార్థి నిరుద్యోగుల తరపున నిలబడి విద్యార్థి నిరుద్యోగుల ఆశాజ్యోతి గా ఉండి 23 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ ఎస్ యు ఐ, యువజన కాంగ్రెస్ లలో, 9ఏళ్లు టిపిసిసి అధికార ప్రతినిధిగా,రెండోసారి టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ తన జీవిత సర్వస్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం విద్యార్థి నిరుద్యోగుల కోసం త్యాగం చేసిన కోటూరి మానవతరాయ్ కి సత్తుపల్లి అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించాలని ఓయూలో గురువారం ఉదయం నిరసన తెలిపిన ఓయూ జేఏసీ నిరుద్యోగ జేఏసీ నేతలు. మానవతారాయ్ కి టికెట్ కేటాయిస్తే రాష్ట్రంలో ఉన్న 30 లక్షల పైచిలుకు నిరుద్యోగులకు న్యాయం చేసినట్లేనని నిరుద్యోగులంతా కలిసి మానవతారాయ్ ని గెలిపించుకొని తీరతామని జేఏసీ నేతలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే : ప్రకటించిన సీఎం
గతంలో పలుమార్లు రాహుల్ గాంధీ ఓయూ ఉద్యమ నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇస్తా అన్నటువంటి హామీని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టుకోవాలని జేఏసీ నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేతలు కొప్పుల ప్రతాప్ రెడ్డి బైరి నాగరాజుగౌడ్, కొమిరే రామచంద్ర యాదవ్, మూడవత్ బిక్షపతి నాయక్, బాణాల నగేష్, ఓయూఎన్ఎస్ యు ఐ వెంకట్ నాయక్,నిరుద్యోగ జేఏసీ నాయకులు మరల పురం శ్రీనివాస్,ప్రకాష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:- తుమ్మల అసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?