Telugu News

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి కి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంతాపం

సత్తుపల్లి-విజయం న్యూస్

0

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి కి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంతాపం

(సత్తుపల్లి-విజయం న్యూస్)
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి కి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మృతి చెందారనే సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర హైదరాబాద్ లోని ఆయన బౌతికఖాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పక్షం, ప్రతిపక్షం అని కాకుండా అన్ని వర్గాలకు మేలు చేసిన ముఖ్యమంత్రి రోశయ్య గారేనన్నారు.

తమిళనాడు, కర్ణాటక గవర్నర్ గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నరసరావుపేట ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు పలు శాఖలకు మంత్రిగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య గారు 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.

also read ;- రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి పువ్వాడ..