Telugu News

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

** కల్లూరు ఆర్అండ్ బీ స్థలాన్ని బస్టాండ్ నిర్మాణానికి కేటాయించాలని వినతి

0

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
** కల్లూరు ఆర్అండ్ బీ స్థలాన్ని బస్టాండ్ నిర్మాణానికి కేటాయించాలని వినతి
(సత్తుపల్లి-విజయం న్యూస్)

సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య లంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ని గురువారం హైదరాబాద్లోని వారి కార్యాలయం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కల్లూరులో ప్రస్తుతం ఉన్నఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కల్లూరు గ్రామంలో సెంటర్లో ఉండటం చేత ఆ ప్రాంతాన్ని నూతన బస్టాండ్ నిర్మాణం కొరకు ఇవ్వటం చేత కల్లూరు మండల ప్రజలకు ప్రజా రవాణా సౌకర్యార్థం అనుకూలంగా ఉంటుందని కావున ప్రస్తుత గెస్ట్ హౌస్ ప్రాంతాన్ని బస్టాండ్ నిర్మాణం కొరకు కేటాయించాలని కోరారు.

కల్లూరు మండలం నందు పుల్లయ్య బంజర గ్రామం దారిలో ప్రస్తుతం వున్న లో లేవెల్ బ్రిడ్జ్ ను హైలెవెల్ బ్రిడ్జి మార్చుటకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా తల్లాడ మండలంలో నారాయణపురం గ్రామం నుండి కొడవటిమెట్ట గ్రామం వరకు, తల్లాడ గ్రామం నుండి గంగాదేవిపాడు గ్రామం వరకు బిటి రోడ్డు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పెనుబల్లి మండలంలోని గంగాదేవిపాడు గ్రామంలో ప్రస్తుతంఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జ్ గా నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తోపాటు కల్లూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, జిల్లా సమన్వయ సమితి సభ్యులు పసుమర్తి చంద్ర రావు పాల్గొన్నారు.

also read :-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర.