Telugu News

సతులకు బదులు పతులు.

ఇచ్చోడ విజయం న్యూస్

0

సతులకు బదులు పతులు

(ఇచ్చోడ విజయం న్యూస్)

ఇచ్చోడ మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం మండల అభివృద్ధి అధికారి రామ్ ప్రసాద్, ఈజీఎస్ ఏపిఓ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు,ఎన్ఆర్ ఈజీఎస్ సిబ్బందితో మెటీరియల్ కంపోనెంట్ పైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలే హాజరవడం ఇందుకు నిదర్శనం ఇవేమి పట్టించుకోకుండా అధికారులు సమావేశాన్ని కానిచ్చేశారు. మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి పతులు హాజరు కావడంపై అక్కడ ఉన్న పలువురు ముక్కున వేలేసుకున్నారు. ఈ సంఘటన పై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

also read ;-గాడితప్పిన “సహాకార”0