కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించాలి: దొడ్డా అరుణ
బిఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది .
కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించాలి: దొడ్డా అరుణ
== బిఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది .
== మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దొడ్డ అరుణ
(ఖమ్మం-విజయంన్యూస్):
భారతీయ జనతా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దొడ్డ అరుణ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనలో వారు చెప్పేది ఒక్కటి, చేసేది ఒక్కట్టి. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు . అర్యహులైన వారికి డబుల్ బెడ్ రూం ఇవ్వడం లో అవకతవకులు జరిగాయని, మహిళా విద్యార్థులు చదువుతున్నాకాలేజీల్లో సరైన బాత్రూమ్ లు కూడా లేని పరిస్థితి ఉందని . తక్షణమే వాటిని ఏర్పాచెయ్యాలి అట్లాగే చిన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు, పౌష్టికాహారం అంగన్వాడి సెంటర్లో నుంచి అందేలా చూడాలని అన్నారు.
ఇది కూడా చదవండి: కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు వివరాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ వచ్చే 6 నెలలో చేయవలసిన కార్యక్రమాలు తెలియ జేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ, రాష్ట్ర మహిళా మోర్చా ఇన్చార్జి విజయం లక్ష్మి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు మందా సరస్వతి, జిల్లా మహిళా మోర్చా ఇన్చార్జి గ్యెంట్యాల విద్యాసాగర్, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పువ్వాళ్ళ పద్మజ, దేవళ్ళ విజయ, జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి అనిత, రాష్ట్ర మహిళా మోర్చా లీగ సెల్ కన్వీనర్ కొలిపాక శ్రీదేవి, మండల అధ్యక్షురాళ్లు జ్యోతి, ఫణికుమారి, సుగుణ, తాటికొండ సంధ్య మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. అర్బన్ టౌన్ 6వ డివిజన్ నుంచి కొంత మంది మహిళలు పార్టీ లో జాయిన్ చేయడం జరిగిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేలు, అధికారులు కుమ్మకైయ్యారు: బీజేపీ నేత శ్రీదర్ రెడ్డి