Telugu News

ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించా

తోకల రవి ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు.

0

ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలి

 ** తోకల రవి ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు.
(మంగపేట‌ – విజయంన్యూస్)

కరోనా మహమ్మారి ఒకటి,రెండు దశలు ముగిసిన తరువాత తిరిగి పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగపేట మండలం స్పెషల్ ఆఫీసర్ తుల రవి కి మంగపేట మండలం తాసిల్దార్ బాబ్జి ప్రసాద్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడుతూ మంగపేట మండలంలోని రమణక్కపేట ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని, అపరిశుభ్రంగా అస్తవ్యస్తంగా, అసంపూర్తిగా నిర్మించిన మరుగుదొడ్లు స్థానంలో నూతన మరుగుదొడ్లు నిర్మించాలని,పాఠశాల ఆవరణలో విద్యార్థులకు మెరుగైన మంచినీటి వసతి కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తోకల రవి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వీర్రాజు ,మేరేజ్ ఖాన్, భాష ,వంశీ తదితరులు పాల్గొన్నారు.

also raed ; దర్శకత్వానికి ప్రభుదేవా వీడ్కోలు