Telugu News

కేసీఆర్ పేరు కోసమే సచివాలయం: షర్మిళ

పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుంది సీఎం పనితీరు

0

కేసీఆర్ పేరు కోసమే సచివాలయం: షర్మిళ

== పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుంది సీఎం పనితీరు

== పేదలంటే కేసీఆర్ కు చిన్నచూపు

== పేదలకు ఇండ్లీవ్వమంటే.. సోకుల భవనం కట్టుకుండు

== 16 వందల కోట్లు ఖర్చు చేసి సచివాలయం కట్టారు

== 9 ఎండ్లలో 9 సార్లు కూడా సచివాలయం కి పోలేదు

== రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు

==  సీఎం కేసీఆర్ పై మండిపడిన వైఎస్ షర్మిళ

== ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా పర్యటించిన వైఎస్ షర్మిళ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సీఎం కేసీఆర్ తన  పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలనే ఏకైక ఉధ్దేశ్యంతోనే, తన పేరు కోసమే కొత్త సచివాలయం కట్టుకున్నాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకరాలు వైఎస్.షర్మిళ ఆరోపించారు. రాష్ట్రంలో పేదలు ఆయ్యో రామచంద్ర అంటుంటే, గూడు లేక, గుడ్డ లేక ఇబ్బందులు పడుతుంటే వాళ్లను పట్టించుకుని సీఎం కేసీఆర్ తన కోసం హంగులతో కలర్ పుల్ భవనాన్ని నిర్మాణం చేసుకున్నాడని, రాష్ట్ర ప్రజలకు అప్పులకుప్పను తలపై మోపుతున్నాడని వైఎస్ షర్మిళ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: సొమ్మసిల్లి పడిపోయిన వైఎస్ షర్మిళ

ఖమ్మంజిల్లాలో పర్యటించిన ఆమె ముందుగా నేలకొండపల్లి మండలంలోని మోటాపురం గ్రామంలో పర్యటించారు. మోటాపురం వీరన్న స్వామి జాతర జరుగుతుండగా ఆ ఉత్సవాల్లో పాల్గొన్న వైఎస్ షర్మిళ, వీరన్న దేవాలయంలో పూజలు చేశారు. ఆలయ చైర్మన్, నిర్వాహకులు వైఎస్ షర్మిళకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం, మొక్కజొన్న, మిర్చి పంటలను పరిశీలించారు. అనంతరం కారేపల్లి, కామేపల్లి మండలంలో పర్యటించారు. ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలను పరామర్శించారు. చీమల పాడు ఘటన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్దులపల్లి మండలం కామేపల్లి గ్రామంలో ఇండ్లు లేని పేద కుటుంబాలను కలవటం జరిగింది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లి  గ్రామంలో ఇండ్లు లేని పేద కుటుంబాలను కలిసిన వైఎస్ షర్మిల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన సోకుల కోసం, తన పేరు కోసం ప్రజా ధనం రూ. 16 వందల కోట్లను ఖర్చు చేసి నూతన సచివాలయం కట్టారని ఆరోపించారు. 9 ఎండ్లలో 9 సార్లు కూడా సచివాలయం కి పోలేని సీఎం కేసీఆర్ కు ఇంత హంగు ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. దేశంలో అద్భుతమైన సచివాలయం నిర్మాణం చేశాడు సీఎం కేసీఆర్ అని గొప్పలు చెప్పుకోవడం కోసమే సచివాలయం నిర్మాణం చేసి హంగామా చేస్తున్నారని అన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి బిగ్ షాక్..*

ఆయన పేరు కోసం రాష్ట్ర ప్రజలను అప్పుల పాలు చేస్తున్నాడని,  రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు. . ఇంత అప్పు చేసినా గ్రామాల్లో మొత్తం గుడిసెలే మిగిలాయని, నాయకులు డాబాలపై డాబాలు, భూమలు వెనక భూములు కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నైజాం హాయంలో నిర్మాణం చేసిన సచివాలయం ను కాదని కొత్త సచివాలయం కట్టడం వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు లాభం ఒరిగిందేమైనా ఉందా..? అని   ప్రశ్నాంచారు. నేటికి  రాష్ర్టంలో 30 లక్షల మందికి ఇళ్ళులు లేవని, వైఎస్ఆర్ ఉన్నప్పుడు  5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 40 లక్షల పక్కా ఇల్లులు మంజూరు చేశారని అన్నారు.  30 లక్షల పేద కుటుంబాలు ఉంటే అందరికీ పక్కా ఇండ్లు మంజూరు చేస్తానన్న సీఎం కేసీఆర్, ఎన్నికలు పూర్తైయి 9ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు కూడా కట్టలేకపోయారని ఆరోపించారు.  లక్షన్నర ఇండ్లు కట్టాడు..ఇందులో 25 వేల మందికి ఇచ్చారని ఆరోపించారు.  డబుల్ బెడ్ రూం అని చెప్పి పథకాన్ని అమలు చేయడం లేదని,  ఇండ్లు ఇస్తామని కేసీఅర్ ఎందుకు హామీ ఇచ్చినట్లో ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు.  అల్లుడు వస్తె ఎక్కడ పడుకోవాలి అని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ ఇంటి అల్లుళ్లను ఎక్కడికి పంపించాలో చెప్పాలన్నారు.  కేసీఅర్ ఎన్నికల ముందు ఓట్ల కోసం మ్యానిఫెస్టో విడుదల చేశాడని, కానీ ఇప్పటి వరకు ఒక్క హామిని కూడా నెరవేర్చలేకపోయారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: పాలేరు ప్రజలకు ‘షర్మిళ’ బంపర్ ఆఫర్

రూ. లక్ష 20 వేల కోట్లు పెట్టీ కాళేశ్వరం కట్టి 70 వేల కోట్లు తిన్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్ టీపీ ప్రభుత్వం వస్తే కాళ్లేశ్వరంలో అవినీతిని మొత్తం బయటకు తీసుకోస్తామని, సామాన్య ప్రజలకు మేలు చేస్తామన్నారు.  ఇప్పుడు సచివాలయం కట్టి అందులో కూడా కమీషన్లు తిన్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు.  సంక్షేమ పథకాలు అమలు చేస్తే కేసీఅర్ కి కమీషన్లు రావు అని, కట్టడాల వైపు మళ్లుతున్నారని, అందులో ఖర్చు పెట్టేది తక్కువ, లాభం అర్జించేది ఎక్కువ అని అన్నారు. వైఎస్ఆర్ టీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టుకునేందుకు మంచి అద్భుతమైన పథకాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

== నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి

అకాల వర్షం కారణంగా గత పదిహేను రోజుల నుంచి రైతులు సాగు చేసి, కష్టపడి పండించిన పంటను వర్షార్ఫణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వైఎస్ షర్మిళ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని,  10 వేలు ఇస్తా అని చెప్పిన సీఎం కేసీఆర్ కొంత మందికి డబ్బులు పంపించి మిగిలిన వారందరికి డబ్బులు ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుందన్నారు. కేసీఅర్ మత్తు వదలాల్సిన అవసరం ఎంతైన ఉందని, లేకపోతే రాష్ట్రాన్ని నిలువున అమ్ముకుంటారని తెలిపారు.

ఇది కూడా చదవండి: *తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు : షర్మిళ

 హంగు ఆర్భాటాలకు ఖజానా ఖర్చు పెట్టకుండా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాలని,  కేసీఅర్ బతుకమ్మ చీరలు అని ఇస్తే అవి ఇండ్లకు కట్టుకొనే పరిస్థితి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జ్ పిట్టా రాంరెడ్డి, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత, నాయకులు క్రిష్ణమోహన్, బానోతు కిషోర్ నాయక్, వూడుగు సుధాకర్ తదితరులు హాజరైయ్యారు.

== నేడు జిల్లాలో షర్మిళ పర్యటన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరసగా రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మొదటి రోజు ఆదివారం ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, నేలకొండపల్లి, కారేపల్లి మండలా

ల్లో పర్యటించిన ఆమె రెండవ రోజు పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  సోమవారం ఉదయం 10 గంటలకు పాలేరు పార్టీ కార్యాలయంలో మే డే జెండా ఆవిష్కరణ చేయున్న షర్మిళ, ఆ తరువాత ఉదయం 10.30 గంటలకు ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడు గ్రామంలో పంట పొలాల పరిశీలించనున్నారు. అనంతరం   ఉదయం 11 గంటలకు తిరుమలాయపాలెం మండల కేంద్రంలో వీవోఏ ల ఆందోళనకు మద్దతు తెలిపే కార్యక్రమం చేయనున్నారు.  11.15 గంటలకు తెట్టెలపాడు గ్రామంలో పంట పొలాల పరిశీలించనున్నారు.  11.30గంటలకు కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో పంట పొలాల పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పాలేరులోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నానరు.