Telugu News

కష్టాల్లో కార్యదర్శి!…

ఇల్లందు_విజయం న్యూస్

0

కష్టాల్లో కార్యదర్శి!…

(ఇల్లందు_విజయం న్యూస్):-

ఉద్యోగ విధుల్లో తీవ్ర ఒత్తిడి భారంగానే బాధ్యతల నిర్వహణ పలువురు నిష్క్రమణ కు సిద్ధం దీర్ఘకాలిక సెలవుల్లో కొందరు  సర్కారు ఉద్యోగం పొందడానికి నేటి నిరుద్యోగ యువతీ,యువకులు పడుతున్న ఆరాటం ..శ్రమ అంతా ఇంతా కాదు ..కోచింగ్ లా పేరిట నెలల తరబడి లక్షల్లో ఖర్చుపెట్టి మరి ఉద్యోగాన్ని పొందుతున్న వారు కొందరైతే ఇక తమకు ప్రభుత్వ ఉద్యోగం రాదనే నిర్ణయానికి వచ్చి ప్రైవేట్ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్న వారు ఎందరో.ఉద్యోగం పురుష లక్షణం ఆన్న నానుడికి స్వస్తి పలికి స్త్రీ లక్షణం కూడా అనే స్థాయిలో ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు కూడా ఉద్యోగాల వేటలో పురుషులతో సమానంగా సంపాదిస్తున్నారు.

అసలు విషయానికొస్తే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు ఎంత వరకు న్యాయం చేయగలుగుతున్నారు .వారు ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నారా.లేక భారంగా .. భయంగా నిర్వర్తిస్తున్నారా అన్నది ఇప్పుడున్న ప్రశ్న .ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే పంచాయతీ కార్యదర్శి విధి నిర్వహణలో తలెత్తుతున్న సమస్యపై సమాలోచన చేయల్సి వస్తోంది.గ్రామాల సమగ్రాభివృద్ది సక్రమంగా కొనసాగాలంటే పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైంది.అయితే ఈ బాధ్యత బారంగా మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి .ఎంతో ఉత్సాహం తో ఉద్యోగంలో చేరిన పంచాయతీ కార్యదర్శులు ఒత్తిడి పేర ఉద్యోగం నుంచి తప్పుకునే పరిస్థితిలకు దారి తీసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 9,335 మందిని పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసిన 1300 మంది అసలు ఉద్యోగంలో నే చేరలేదు.ఉద్యోగంలో చేరిన వారిలో సుమారు 350 పై చిలుకు  మంది రాజీనామాలు చేశారు.మరి కొందరు దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 980 గ్రామ పంచాయతీ లు వున్నాయి .ప్రతి గ్రామ పంచాయతీ కి కార్యదర్శి ని నియమించాల్సి ఉండగా కొంత వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి .తాజాగా వుమ్మడి జిల్లాల్లో మాకొద్దు ఈ కొలువు అంటూ పలువురు రాజీనామాలు చేయడం జరిగింది.ఇది రాను రాను పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.గ్రామాల సమగ్రాభివృద్ధికి  పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో వుంటుందని ప్రభుత్వం వెల్లడిస్తోంది ఇందుకు కొలువుల జాతర ప్రవేశ పెట్టడంతో ఎంతో ఆసక్తితో కార్యదర్శి పోస్టులను చాలా మంది కష్టపడి సంపాదించారు.ఎంత వుత్సహం గా ఉద్యోగాల్లో చేరారో అంతే స్పీడుతో రాజీనామాల పర్వం మొదలు పెట్టారు.

ఎక్కువ మంది చెప్పే కారణం మాత్రం పని భారమేనని స్పష్టం అవుతుంది.అంతే కాకుండా చాలి చాలని వేతనం .ఉద్యోగ భద్రత లేకపోవడం తో పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల ఆసక్తి చూపడం లేదు.సర్కారు కొలువు తమకు అగ్ని పరీక్షల తయారైందని వాపోతున్నారు.ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని అయినప్పటికీ వచ్చిన ఉద్యోగాన్ని వదలలేక ..కొందరు తమ కొద్దుబాబో   అంటూ మరికొందరు తప్పుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా స్వచ్ఛ భారత్ మెషీన్ లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం .హరిత హరం లో మొక్కల సంరక్షణ ,టార్గెట్ ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు.వీటికి తోడు ఉద్యోగ భద్రత కరువైంది.

  …  కొత్త చట్టంతో తంటాలు…. 

ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలో సమూల మార్పులు చేసి కొత్త చట్టం రూప కల్పన చేసిన విషయం తెలిసిందే.హరిత హరం కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కి నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటించడంతో పాటు నాటిన మొక్కల్లో 85 శాతం బతికెలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్ తో పాటు కార్యదర్శిదేనని సిఎం కేసిఆర్ వెల్లడించారు .లక్ష్య సాధనలో విఫలమైతే మూడేళ్ళ తర్వాత వారి ఉద్యోగం పర్మినెంట్ కాదని కొత్త చట్టం లో పేర్కొన్నామని వివరించారు .అంతే కాకుండా అన్ని శాఖల అధికారులకు పంచాయతీ కార్యదర్శి జవాబు దారి తనంగా మారడం పంచాయతీలో ఎది జరిగిన ఆయన బాధ్యత వహించాలని సర్కారు స్పష్టం చేసిం

……సస్పెండ్ ,మెమోలతో బెంబేలు ….. 

హరిత హరం లో బాగంగా  నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యదర్శులను ఆదేశించింది.గ్రామాల్లో 85 శాతం మొక్కలను రక్షించడం కార్యదర్శి వల్ల అయ్యే పనేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది .ఇందుకు సిబ్బంది సహకారం కూడా ఉండాలి .పంచాయతీల్లో సరైన సిబ్బంది లేకపోవడం తో అన్ని తానై విధులు నిర్వర్తించాల్సి వస్తోందని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు .అంతే కాకుండా పంచాయితీ నిధుల డ్రా సర్పంచ్ లకు ఇవ్వడంతో నిధుల దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటాయి.ఇందుకు సంబంధించి ఆడిటింగ్ మాత్రం కార్యదర్శులకు అప్పగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.నిధులు దుర్వినియోగం జరిగితే ఎవరిది బాధ్యత ని నిలదీస్తున్నారు .తాజాగా మొక్కల సంరక్షణ సరిగా చేయలేదన్న ఆరోపణలతో కొందరు కార్యదర్శులకు మెమోలు ఇచ్చిన విషయం తెలిసిందే.కొత్త చట్టం పుణ్యమా అని మూడేళ్లలో వారి పని తీరును ఆధారంగా చేసుకొని పర్మినెంట్ చేయడం జరుగుతుంది .దీంతో అదనపు బారం వల్ల ఉద్యోగ భద్రత పై అప నమ్మకం ఏర్పడుతోందని వాపోతున్నారు.దీనికి తోడు చాలి చాలని వేతనాలు ఇవ్వడం అవికూడా సరిగా సమయానికి అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి .మొత్తంగా పంచాయతీ కార్యదర్శుల జీవితం పుండు పై కారం చల్లినట్లుగా మారిందని చెప్పొచ్చు.

also read :-గోరేటి వెంకన్నకు అరుదైన గౌరవం