నక్సల్స్ కుట్ర భగ్నం చేసిన భద్రతా బలగాలు
( భద్రాచలం – విజయం న్యూస్ )
తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ కుట్రని భద్రతా బలగాలు భగ్నం చేశారు. కాంకర్ జిల్లా అంతగఢ్ పోలీస్‌స్టేషన్ పరిథిలోని చర్రె ముర్రె – మేడం రహదారిపై మావోయిస్టులు అమర్చిన శక్తివంతమైన మూడు ఐఈడీలను బీఎస్ఎఫ్, డీఎఫ్‌ల సంయుక్త బృందం ముందే గుర్తించడంతో భద్రతా బలగాలకు పెనుప్రమాదం తప్పింది. వాటిని బాంబ్ డస్పోజబుల్ బృందం సహాయంతో వెలికితీసి నిర్వీర్యం చేశారు. ఒక్కొక్క మందుపాతర సుమారు 7 కిలోల బరువు ఉన్నట్లు జవాన్లు తెలిపారు. ఐఈడీ ప్లాంటేషన్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టారు.