Telugu News

విత్తన దుకాణాలు తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్.

ఏన్కూర్ విజయం న్యూస్

0

విత్తన దుకాణాలు తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్.

(ఏన్కూర్ విజయం న్యూస్): –

మండలంలోని పలు విత్తన దుకాణాలను, గోడౌన్ లను శుక్రవారం రాష్ట్రస్థాయి విత్తన టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ చేసింది. ఏన్కూరు, బి ఆర్ పురం,తిమ్మారావుపేట తదితర గ్రామాల్లో ని విత్తన దుకాణాల్లో సీడ్స్ లైసెన్స్ ఇన్వాయిస్, స్టాక్ బోర్డ్స్, రిజిస్టర్లు, విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఉషారాణి మాట్లాడుతూ రైతులు లైసెన్స్ కలిగిన విత్తనాలు దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, సంబంధిత బిల్లులను తమ వెంట ఉంచుకోవాలని కోరారు మోసపూరితంగా అమ్మ చూపే ప్రైవేటు వ్యక్తుల నుండి ఎటువంటి విత్తనాలను కూడా కొనకూడదని అన్నారు

also read :-పట్టణ ప్రగతిపై మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ సమీక్ష

గ్రామాల్లో అడ్వాన్స్ బుకింగ్ అని, గుడ్డ సంచులలో ఇతర ప్యాకింగ్ లతో అమ్మ చూపే వారి నుండి ఎటువంటి విత్తనాలను కొనుగోలు చేయరాదన్నారు. లైసెన్స్ లేకుండా విత్తనాలను అమ్మే వారి సమాచారాన్ని టాస్క్ఫోర్స్ బృందానికి తెలియజేయాలని ఉషారాణి కోరారు. ఈ కార్యక్రమంలో ఏసిపి రామానుజం, హైదరాబాద్ కమిషనరేట్ విత్తన ధ్రువీకరణ అధికారి వేణుమాధవ్,ఖమ్మం ఏ డి ఏ శ్రీనివాస రెడ్డి,ఎస్సై సాయికుమార్ ,ఏవో నరసింహారావు, పోలీసులు అక్బర్ ,రాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.