Telugu News

యాదవులకు తక్షణమే గొర్రెలను పంపిణి చేయండి: రాయల

పంపిణి చేయకపోతే ఉద్యమం తప్పదు

0

యాదవులకు తక్షణమే గొర్రెలను పంపిణి చేయండి: రాయల

== పంపిణి చేయకపోతే ఉద్యమం తప్పదు

(కూసుమంచి-విజయంన్యూస్)

యాదవులకు పంపిణీ చేస్తామన్న రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదటి విడతలో యాదవులకు గొర్రెలు ఇస్తామని చెప్పి గత 4 సంవత్సరాల క్రితం ప్రభుత్వ డిపాజిట్ కట్టించుకొని కొంతమందికి గొర్రెలు పంపిణీ చేసి కొంతమందికి గొర్రెలు ఇవ్వలేదు మొదటి విడతగా గొర్రెలు ఇవ్వని వారికి న్యాయం చేయాలి రెండో విడతగా పాలేరు నియోజకవర్గం లో వందలాది యాదవులు 43500 ప్రభుత్వానికి డిపాజిట్ కట్టినారు సంవత్సర కాలంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేయడం వలన డిడి కట్టిన వారు ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మాట దాటవేస్తే వస్తుంది ఇప్పటికైనా డిడి కట్టినా వారికి గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి కచ్చితంగా యాదవులకు మద్దతుగా పోరాటం చేస్తామని, ప్రభుత్వ మెడలు వంచైనా బాధిత లబ్ధిదారులకు గొర్రెలు వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.

allso read- పాదయాత్రలో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క