Telugu News

సీపీఐ సీనియర్ నేత వెంకట్ రెడ్డి మృతి

సంగబత్తుల వెంకట్ రెడ్డి కి నివాళులర్పించిన సిపిఐ నాయకులు

0

సీపీఐ సీనియర్ నేత వెంకట్ రెడ్డి మృతి

== సంగబత్తుల వెంకట్ రెడ్డి కి నివాళులర్పించిన సిపిఐ నాయకులు

(కూసుమంచి -విజయం న్యూస్)

స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, గైగొల్లపల్లి మాజీ సర్పంచ్, సిపిఐ సీనియర్ నాయకులు సంగ బత్తుల వెంకటరెడ్డి (98) ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యం తో బాధపడుతూ చనిపోయారు. ఆయన కూసుమంచి మండలం గైగోళ్ళపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ గా పని చేశారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిచెందడం పట్ల మండల ప్రజలు బాధపడుతున్నారు. ఆయనకు ప్రగాఢ నివాళ్ళు అర్పిస్తున్నారు.

== నివాళ్ళు అర్పించిన సీపీఐ నేతలు

సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేష్ , రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, తోటరామాంజనేయులు, మేకల శ్రీనివాసరావు, జిల్లా సమితి సభ్యులు గుండె పొంగు మల్లేష్, మండల కార్యదర్శి నరసింహా తదితరులు నివాళులర్పించారు. అనంతరం వారి కుమారులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.