Telugu News

నెలాఖరులోగా టీచర్ల విభజన.!

పాత పోస్టులే కొత్త జిల్లాలకు సర్దుబాటు.

0

నెలాఖరులోగా టీచర్ల విభజన.!

పాత పోస్టులే కొత్త జిల్లాలకు సర్దుబాటు.

ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ.

( విజయం న్యూస్) :-

కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల విభజన, సర్దుబాటు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని పాత పోస్టులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు. స్థానికతతో సంబంధం లేకుండా టీచర్ల కేటాయింపు చేపట్టనున్నట్టు తెలిసింది. ఉదాహరణకు నిజామాబాద్‌ జిల్లాలో పది వేల టీచర్‌ పోస్టులు ఉన్నాయనుకుంటే నిజామాబాద్‌కు ఆరు వేలు, కామారెడ్డికి నాలుగు వేలు కేటాయిస్తారు. వెయ్యి ఖాళీలుంటే నిజామాబాద్‌కు ఆరొందలు, కామారెడ్డికి నాలుగొందల చొప్పున కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీచేయనున్నట్టు తెలిసింది.

పరిశీలనలో ఉన్న అంశాలు :-

ఉమ్మడి జిల్లాలోని మొత్తం పోస్టులను ఆ జిల్లా నుంచి విడిపోయిన కొత్త జిల్లాలకు కేటాయిస్తారు.
శాఖలో అంతర్గతంగా ఒక కమిటీని నియమించే అంశం పరిశీలనలో ఉన్నది.
కేటాయించిన పోస్టుల కన్నా ఎక్కువ సంఖ్యలో టీచర్లు ఉంటే.. వారికి ఆప్షన్లు ఇచ్చి, సర్దుబాటు చేస్తారు. అయినా టీచర్ల సంఖ్య అధికంగా ఉంటే జూనియర్‌లను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో ఏదైనా మండలం కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు వెళ్తే సంబంధిత టీచర్‌.. ఆ కొత్త జిల్లాతోపాటు ప్రస్తుతం ఉన్న జిల్లాకు ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకు కాటారం మండలంలోని టీచర్‌ పాత కరీంనగర్‌ జిల్లాతో పాటు, ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు.

also read :-కబడ్డి ఆడిన తుమ్మల.