సేవాతత్పరుడు డాక్టర్ పులిపాటి..
పులిపాటి ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్ధుల విదేశీ విద్యకు పదిలక్షలు రూపాయలు అక్షోభయ ట్రస్టుకు అందజేత
సేవాతత్పరుడు డాక్టర్ పులిపాటి..
== ఖమ్మంలో విశేష సామాజిక సేవాకార్యక్రమాలు
== పులిపాటి ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్ధుల విదేశీ విద్యకు పదిలక్షలు రూపాయలు అక్షోభయ ట్రస్టుకు అందజేత
== ఖమ్మం పులిపాటి నర్సింగ్ కాలేజీ లో వెల్లువెత్తిన పులిపాటి దంపతుల సేవలు..
== నిరుపేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలతో నిరుపేదల్లో నిoడిన ఆనoదం…
== సర్వమత ప్రార్ధనలతో ఆశీర్వచనాలు అందుకున్న డాక్టర్ పులిపాటి దంపతులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కులమతాలకతీతంగా డాక్టర్ పులిపాటి సామాజిక సేవల నిర్వహణ అభినందనీయమని, సేవాతతత్పరులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ అని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్థపు మురళి, ,బుడిగెం శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు చిన్ని కృష్ణారావు, ఆర్యవైశ్య సంఘం వనమాసూరి, కిరాణాజాగీర్ అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు కావ్యహాస్పటల్ సీఈఓ డాక్టర్ కావ్యచంద్ యాలముడి, మాతృశ్రి ఎండీ డాక్టర్ నీరజ, పలువురు కార్పొరేటర్లు అన్నారు..
ఇది కూడా చదవండి: అట్టహాసంగా ‘దశాబ్ది’ సంబురాలు చేద్దాం: మంత్రి
సోమవారం ఖమ్మం నగరంలోని. పులిపాటి నర్సింగ్ కళాశాల ఆవరణలో సామాజిక సేవా కార్యక్రమాలు గోళ్ళ రాధాకృష్ణ సభాద్యక్షతన ఘనంగా జరిగాయి.. పులిపాటి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పులిపాటి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు..మరికొంత మంది విద్యార్థినులు స్వచ్ఛందంగా విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని హ్యాపీ బర్తడే అంటూ వారీ అభిమానానికి అవధులు లేకుండా పోయింది..ఒక ప్రజాప్రతినిధికి వుండాల్సిన చరిష్మా పులిపాటి వుందని చెప్పడంలో ఎలాంటి ఆతిషయొక్తి లేదు.. .ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ….ఎవరైనా పులిపాటి వద్దకు వచ్చి అన్నా అనివస్తే సహాయం చేసే హెల్పింగ్ హాండ్స్ పులిపాటిదని, హెల్పింగ్ హార్ట్ ఉన్న మహోన్నతుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ అని, సామాజిక సేవకులు విద్యావేత్త పులిపాటి నర్సింగ్ కళాశాల అధినేత భారత రాష్ట్ర సమితి నాయకులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ జన్మదినోత్సవాన్ని ఆర్భాటాలు లేకుండా సామాజిక సేవలరూపంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు.. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పులిపాటి నర్సింగ్ కాలేజీ ఆవరణలో నిరుపేదలకు అన్నదానంతో పాటు వస్త్రదానం, ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు జరుపడం హర్షణీయమన్నారు..డాక్టర్ పులిపాటి ప్రసాద్ తండ్రి నరసింహారావు జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయలను నిరుపేద విద్యార్థుల విదేశీవిద్యకు కోసం అక్షోభయ ట్రస్ట్ కు అందజేయడం, ఖమ్మo జిల్లాలో బస్వాపురం గ్రామంలో సాయిబాబా విగ్రహాన్ని వితరణ కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు..
ఇది కూడా చదవండి: కేసీఆర్ ను గద్దే దింపే.. దమ్మున్నోళ్లా..?: మంత్రి
ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ విద్యానిదికి 55 వేల 116 లను వనమా సూరికి సామాజిక సేవాకార్యక్రమాలకు 25 వేల రుపాలయ చెక్కును రామకృష్ణకు అందజేయడం సంతోష దాయకమన్నారు..ఈమేరకు వారు పులిపాటి దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బుర్రి వెంకట్, మాజి కార్పొరేటర్ నర్రా రమేష్, బీసీ జేఏసీ చైర్మన్ పాల్వంచ రామారావు sc వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బివి రాఘవులు, ఉపెందేర్ నాయక్, వరప్రసాద్, వెంపటి రంగారావు,లక్ష్మీనారాయణ, గుమ్మడివెల్లి శ్రీనివాస్, అవోప కృష్ణమూర్తి, బీఆర్ఎస్ నాయకులు చిన్నా, ప్రముఖులు శ్రీ కళారెడ్డి, జ్యోతి, రాణి, ఆశా, రామకృష్ణ, ప్రతాప్, ప్రవీణ్ పురప్రముఖులు తదితరులు పాల్గోన్నారు