సమితి సభ్యుల సేవలు శ్లాఘనీయం…
భవిష్యత్లో మరింత సేవ చేయాలని నామ ఉద్బోధన
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నిరుపేదలు, సామాన్య ప్రజానీకానికి సేవలో ముందంజలో ఉండే నామ సేవా సమితి, ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు ఎంపీ నామకు పుష్పగుచ్ఛం అందజేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనకు మిఠాయిలు తినిపించారు.
ఈ సందర్భంగా నామ నాగేశ్వర్రావు మాట్లాడుతూ తనపై అభిమానంతో నామ సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవా కార్్క్రమాలు శ్లాఘనీయమన్నారు. పేదవారికి నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొని సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలో ట్రస్ట్ తరుపున ఆటో డ్రైవర్లుకు ఉచితంగా పంపిణి చేస్తున్న ఖాకీ చొక్కాల కార్యక్రమంలో అందరికీ అందే విధంగా కార్యాచరణ రూపొందించికోవాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సలహానిచ్చారు.
దాంతోపాటు, అలానే భవిష్యత్ లో కూడా నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్, నామ సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పేద ప్రజలు, ఆపదలో ఉన్న వారికి అండగా ఉండి సేవ చేయడంలో ముందు ఉండాలని నామ సేవా సమితి సభ్యులకు నామ నాగేశ్వర్రరావు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో నామ సేవ సమితి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ (కెపి), దుద్దుకూరు రాజా, నవీన్, అరవింద్, రామకృష్ణ, బిందు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :-నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటి కాంటాక్ట్ ప్రోగ్రామ్ : ఏసీపీ సారంగపాణి