Telugu News

ఖమ్మంలో సందడి చేసిన సేవాదాస్ చిత్రయూనిట్

== ఘనంగా స్వాగతం పలికిన గిరిజన నాయకులు == అభిమానులతో కలిసి సుందర్ థియేటర్లలో సినిమా సూచిన చిత్రయూనిట్

0

ఖమ్మంలో సందడి చేసిన సేవాదాస్ చిత్రయూనిట్
== ఘనంగా స్వాగతం పలికిన గిరిజన నాయకులు
== అభిమానులతో కలిసి సుందర్ థియేటర్లలో సినిమా సూచిన చిత్రయూనిట్
(ఖమ్మం-విజయంన్యూస్)
లంబాడీల ఆత్మగౌరవం, లంబాడీ బాషలో తీసిన తొలి సినిమా సేవాదాస్ చిత్రం యూనిట్ ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. నగరంలో సుందర్ థియేటర్లలో ఆడుతున్న సేవాదాస్ సినిమాను వీక్షించడానికి వచ్చిన చిత్ర యూనిట్ సందడి చేశారు. వచ్చిన యూనిట్ సభ్యులకు ప్రేక్షకులు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఈ సినిమా హీరో కథ స్క్రీన్ప్లే దర్శకత్వం బంజారా మెగాస్టార్ కేపియన్ చౌహాన్ మాట్లాడుతూ ఈ సినిమా హీరో మాట్లాడుతూ మేము ఎంతో కష్టపడి తీసిన సినిమాను నా బంజారా బిడ్డలు అందరూ కుటుంబ సభ్యులతో తప్పక చూసి మమ్ముల్ని ఆశీర్వదిస్తే మేము మరిన్ని మంచి సినిమాలు భవిష్యత్తులో తీస్తాము అని చెప్పారు .

also read :-ఖమ్మంలో ఉమెన్ క్రికెట్ మ్యాచ్ షూరు

also read :-నేడు ఖమ్మం జిల్లాకు షర్మిళ పాదయాత్ర

వీరితో పాటు ప్రొడ్యూసర్ వినోద్ రైనా ఇస్లావత్ , కో ప్రొడ్యూసర్ బాలు చౌహాన్ , కోడైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు . వచ్చిన సినిమా యూనిట్ కి పూల మాల వేసి శాలువతో ఘనంగా అభిమానులు సత్కరించారు . ఇలాంటి బంజారా సినిమాలను మరెన్నో తీయాలని ఉచితంగా సినిమాను బంజారా ప్రేక్షకులకు చూపించిన బానోతు కోటేశ్వరరావు , కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ , రవి రాథోడ్ , ధరావత్ రామ్మూర్తి నాయక్ , మాలోతు దేవేందర్ కుమార్ , బానోతు గబ్బర్ సింగ్ , తదితరులు ఆకాంక్షించారు . బంజారా బిడ్డలు గౌరవ పడేలా సూపర్ డూపర్ హిట్స్ సినిమాలు తీసి అగ్ర స్థానంలో నిలవాలని కోరారు . ఈ సినిమాను బంజారా ప్రముఖులతో పాటు సుమారుగా 1000 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ అవకాశం ఇచ్చిన ధియేటర్ యాజమాన్యానికి , ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .