Telugu News

కాంగ్రెస్ ని విమర్శిండం సిగ్గు చేటు: పువ్వాళ్ల

నిరుద్యోగ నిరసన ర్యాలీ విజవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

0

కాంగ్రెస్ ని విమర్శిండం సిగ్గు చేటు: పువ్వాళ్ల
👉🏻అభివృద్ధి ఏది అని అడిగితే విమర్శల
👉🏻ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ కృషి
👉🏻విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి
👉🏻నిరుద్యోగ నిరసన ర్యాలీ విజవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
👉🏻విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గప్రసాద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కాంగ్రెస్ చేసిన కృషితో నేడు పదవులు అనుభవిస్తున్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆరోపించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీలో ఆయనే కీలకమా..?

ముందుగా సోమవారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేసిన నిరుద్యోగ యువతకు, అభిమానులకు, కార్యకర్తలకు, ట్రాఫిక్ ఇబ్బందులను కంట్రోల్ చేసిన పోలీస్ వారికి, సహకరించిన వాహన దారులకు అన్ని అనుబంధ సంఘాల నాయకులకు, తగు కవరేజీ ఇప్పించిన ప్రింట్ మరియు పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంలో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీ మిగతా జిల్లాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.అంతే కాకుండా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 400 కిలోమీటర్ల పాదయాత్ర విజవంతంగా పూర్తి చేసినందుకు విక్రమార్క గారికీ కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పోరాటానికి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేక జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని,ఇప్పుడున్న ప్రజా ప్రతినిధుల్లో ఏ ఒక్కరిది కాంగ్రెస్ ని విమర్శించే స్థాయి కాదని ఆ అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ చేసిన కృషి అని అభిప్రాయపడ్డారు. ఎంతోమంది ఆత్మ బలిదానాల త్యాగాల ఫలితాలతో సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే నేడు అలాంటి పార్టీపై అవాకులు చెవాకులు పేలడం దురదృష్టకరమని అన్నారు. బీఆర్ఎస్ ఎజెండా సంక్షేమమే అని చెబుతున్న బీఆర్ఎస్ నేతలకు సంక్షేమం గురించి తెలుసా అని ప్రశ్నించారు. రోడ్ల పొంటి కలర్ఫుల్ వాల్ పెయింట్ లతో, వీధి దీపాలతో సంక్షేమం సాధించినట్టా అని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: ఏన్కూరులో రోడ్డు ప్రమాదం…ఇద్దరి మృతి

రైతులను నిరుద్యోగులను మోసం చేస్తూ 8 ఏళ్లు కాలం గడిపారని ఆరోపించారు. రైతుబంధుతో ఎవరు ఎక్కువ లబ్ది పొందుతున్నారు బీఆర్ఎస్ నేతలు ఆలోచించాలని అన్నారు. రైతుబంధు ఇస్తూ పంట నష్టపరిహారం పక్కన పడేసారని, పంటలకు ఇన్సూరెన్స్ లేకుండా చేశారని అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే
బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తామే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉందని అన్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి వచ్చిన స్పందన చూసి టిఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదని అందుకే పని కట్టుకొని కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని హితవు పలికారు. యెనిమిది ఏండ్ల లో చేసిన అభివృద్ధి ఏది అని అడిగితే అర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, టీపీసీసీ ఉపాధ్యక్షలు మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరావు, పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరావు,జిల్లా SC సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,మిక్కిలినేని నరేందర్,ముస్తఫ,పల్లెబోయిన చంద్రం,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం: పువ్వాళ్ల దుర్గప్రసాద్