శంకర్ దాదా ఆర్ఎంపీలు…
== ఇల్లందులో ఎటువంటి ఆల్బం లేని కొందరు క్లినిక్ లు ఏర్పాటు
== పరిమితికి మించి వైద్యం నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు
== పలుచోట్ల మెడికల్ షాపుల వైద్యం సేవలు
== పట్టించుకుని జిల్లా వైద్యాధికారులు
(ఇల్లందు- విజయంన్యూస్):
కొండ నాలుక కు మందు ఇస్తే ఉన్న నాలుక పోయినట్లు ఇల్లందులో కొందరి ఆర్ఎంపి ల వైద్యం అలా ఉంది. ఎటువంటి అనుభవం లేని శంకర్ దాదా ఎంబిబిఎస్ టైపు ఇల్లందులో శంకర్ దాదా ఆర్ఎంపీలు అంటూ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నారు. పరిమితికి మించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం డెంగ్యూ కలకలం సృష్టిస్తుంది .ఇల్లందు ఏజెన్సీ మొత్తం విలయతాండవ వేస్తుంది. డెంగ్యూకు సరైన వైద్యం అందించే ఆర్ఎంపీలు లేరు. అందరూ అనర్హులే. అయినప్పటికీ వైద్యం తీసుకున్న రోగులు నాలుగైదు రోజుల తర్వాత ఖమ్మంకు అటాచ్మెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు భారీ ఎత్తున ఖర్చు వస్తుంది. అందులో కమిషన్ పెద్ద ఎత్తున ఆర్ఎంపీలకు వెళుతుంది. ఈ నేపథ్యం పైనే ప్రత్యేక కథనం…
ఇది కూడా చదవండి: రేపు జిల్లాకు తుమ్మల రాకా
ఇల్లందు మండలం, పట్టణం లో లక్ష మంది జనాభా. ఎంబిబిఎస్, ఎంబిబిఎస్ డిసిహెచ్ ,ఎంబిబిఎస్ డీజీవో, లను వేళ్ళపై లెక్కించవచ్చు. అందరూ కలిపితే ఆరుగురు మాత్రమే ఉన్నారు .పేదల సొమ్మును దండిగా దండుకుంటున్నారు. రోజుల తరబడి వైద్యం అందిస్తూ ప్యాకేజీని మాట్లాడుకుంటున్నారు. లేదా గంప గుత్తాగా ఇంత మొత్తం ఇవ్వాలని చెబుతూ పేద ప్రజల రక్తాన్ని పిండుకుంటున్నారు. కనీసం అవగాహన లేని ఆర్ఎంపీలు కొక్కల్లాలు . అలా అని తీసి పారేస్తే సరైంది కాదు. అందులో అనుభవ ఉన్న ఆర్ఎంపీలు చాలామంది ఉన్నారు. ఈ రెండు, మూడు సంవత్సరాల కాలంలో అనేక మంది ఆర్ఎంపీలు ఏర్పాటు చేసుకున్నారు .ఎటువంటి వైద్య నైపుణ్యత లేని వ్యక్తులంతా సీజన్ గా వచ్చే వ్యాధులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇకపోతే తెలియని ఆర్ఎంపి తెలిసిన ఆర్ఎంపి లకు ఫోన్ చేసి పలు రకాల వ్యాధులతో ఉన్న మహిళ గురించి వివరించి వాటికి సంబంధించిన టాబ్లెట్లు ఫోన్లో విని వాటిని మెడికల్ షాప్ కు రాస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇల్లందులో చాలా పురావృతం అయ్యాయి. ల్యాబ్ మీద అసలు పరిజ్ఞానమే లేదు. బై కెమిస్ట్రీ ,సి బి పి, వై డాల్ ప్లేట్లెట్స సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన లేదు. ల్యాబ్ లో టెస్టులు చేయించుకుని రిపోర్టులు పట్టుకొచ్చిన సదరు ఆర్ఎంపీలకు అవగాహన లేదు. ల్యాబ్ ఇన్చార్జిలకు ఫోన్ చేసి ఏమైందని తెలుసుకోవడమే తప్ప రిపోర్టులపై నైపుణ్యతను సంపాదించుకోలేదు. ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్న పట్టించుకోవట్లేదు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు
రోజుకొకరు సీజనల్ వ్యాధులతో మృత్యువాత పడుతున్న స్పందన లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే రోజుల తరబడి వైద్యం చేయించాల్సి వస్తుంది అదే ఆర్ఎంపీల దగ్గరకు వెళితే త్వరగా న్యాయం అవుతుందని భావించి వెళ్తున్నారు కానీ అందుకు విరుద్ధంగా ఇలాంటి సంఘటనలు పురావృతం అవుతున్నాయి.
_ ఖమ్మం వైద్యులతో కుమ్మక్కు:
మూడు నాలుగు రోజులు వైద్యం ఇచ్చిన తర్వాత రోగికి తగ్గలేదంటే ఖమ్మం దగ్గర ఉండి తీసుకువెళ్లి కుమ్మక్కైన డాక్టర్లకు అప్పగించి వస్తున్నారు. అందులో భారీ కమిషన్ ఆర్ఎంపీలు పొందుతున్నారు .రోజు ఇల్లందు మండల పట్టణం నుంచి వందల సంఖ్యలో రోగులను తరలిస్తున్నారు .డెంగ్యూ పట్ల అవగాహన లేక ఇవ్వాల్సిన మందులు ఇవ్వలేక ఖమ్మం బాట పడుతున్నారు. ముందస్తుగా లక్షణాలు కనిపించిన సరైన వైద్యం తెలియక రోగులను తరలిస్తున్నారు.
_ పలుచోట్ల వైద్యం చేస్తున్న మెడికల్ షాపుల నిర్వాహకులు
వింత విషయం ఏమిటంటే పలుచోట్ల మెడికల్ షాపుల నిర్వాహకులే వైద్యం అందిస్తున్నారు. ఎటువంటి బోర్డులు లేకుండా మెడికల్ షాప్ లోనే వైద్యం చేస్తున్నారు. సెలైన్ బాటిల్ పెట్టాలన్న క్యాన్ల పెట్టాలన్న మెడికల్ షాపుల నిర్వాహకులు పెడుతున్నారు. అవసరమైతే ఇంటి దగ్గరికి వెళ్లి హోం ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: రైతులను సుభీక్షంగా చూడాలి: పొంగులేటి
ఈ మెడికల్ షాపుల నిర్వాహకుల పట్ల కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆర్ఎంపి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఉన్నచోట వైద్యం చే యించుకోవచ్చు ఎటువంటి బోర్డులు లేకుండా మెడికల్ షాపులు నడుపుతున్న వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవడం ప్రమాదకరం. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు సదస్సు సమావేశాల ద్వారా రోగులకు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. వాస్తవం ఏమిటంటే బీఫార్మసీ చేసిన వాళ్లే మెడికల్ షాపులకు అర్హులు. ఒకరి పేరు మీద తీసుకువచ్చి మెడికల్ షాపులు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు .ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.