Telugu News

 ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా  ‘షర్మిళ’

కాంగ్రెస్ గూటిలోకి సీఎం సిస్టర్

0

 ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా  ‘షర్మిళ’

== కాంగ్రెస్ గూటిలోకి సీఎం సిస్టర్

== టిక్కెట్ రేసులో చర్చలు సఫలం

== పాలేరుతో పాటు మూడు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని అడిగిన షర్మిళ

== ఎంపీతో పాటు మరో ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామన్న కాంగ్రెస్

== దళితబిడ్డకు టిక్కెట్ ఇచ్చే అవకాశం

== త్వరలో తెలంగాణకు ప్రియాంక గాంధీ

== హైదరాబాద్ లో విజయమ్మను కలవనున్న ప్రియాంక గాంధీ.. అదే రోజు పార్టీ విలీనం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా నూతన పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిళ పార్టీ బలోపేతం కోసం శతవిధాల ప్రయత్నాలు చేశారు..మొదలు పార్టీ జడ్ స్పీడ్ లో వెళ్లినప్పటికి ఆ తరువాత బ్రేక్ లు పడుతూ వచ్చాయి.. కోటి ఆశలతో పార్టీని స్థాపించి అదే ఊపుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్ షర్మిళకు తెలంగాణ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు.. మొదట పార్టీ అవిష్కరణ సమయంలో పార్టీలోకి వచ్చిన నాయకత్వం తప్ప ఆ తరువాత పెద్దగా చేరికలు కనిపించలేదు..

ఇది కూడా చదవండి: కందాళకు షాడోల భయం

పైగా పార్టీలోకి వచ్చిన వారు తిరిగి వెనుదిరిగి వెళ్లిపోయారు.. ఫలితంగా పార్టీని నడపడం కష్టమని భావించిన వైఎస్ షర్మిళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నయ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని భావించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు వైఎస్ షర్మిళ సంసిద్దమైయ్యారు.. అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిళ.. తను స్థాపించిన పార్టీని విలీనం చేసేందుకు అంగీకరించారు. అంతే కాకుండా టిక్కెట్లను కేటాయించాలని అడిగిన వైఎస్ షర్మిళకు అధిష్టానం సానుకూలంగా స్పందించింది.. అయితే వైఎస్ షర్మిళ కాంగ్రెస్ అగ్రనేతలతో ఏం మాట్లాడారు.. ఎప్పుడు పార్టీని విలీనం చేస్తున్నారు..? ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై ‘విజయం’ పత్రిక ప్రతినిధి అందించే ఎక్స్ క్ల్యూజివ్ రాజకీయవిశ్లేషణాత్మక కథనం మీ కోసం..  

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తే వైఎస్ షర్మిళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వంత చెల్లెలు..గత పదేళ్ల క్రితం రాజకీయమంటే ఏంటో తెలయని ఆమె.. సోదరుడు జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ ప్రచార బాధ్యతలను చేతపట్టి ఒంటి చేత్తో పార్టీని నడిపించి పాదయాత్ర చేసి నమ్మిన నాయకత్వానికి భరోసానిచ్చింది ఆమె… ఆ తరువాత ఏపీలో వైసీపీ పార్టీ జయకేతనం ఎగరేసే విషయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తరువాత ఏం జరిగిందేమో కానీ.. రెండేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్దమైంది.. వైసీపీ పార్టీకి బలమిచ్చిన, వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నఖమ్మం కేంద్రంగా పార్టీని అవిష్కరించిన ఆమె పార్టీ నిర్మాణంలో వైఫల్యం కారణంగా వెనకడగు వేస్తూ, భవిష్యత్ కల్గిన పార్టీలో విలీనం చేసేందుకు అడుగులేస్తున్నారు. అతి త్వరలోనే పార్టీ విలీనం చేసేందుకు చర్యలు చేపట్టిన ఆమె రాజకీయ భవిష్యత్ పై ఆలోచన చేస్తున్నారు.. అతి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె దారి.. అసెంబ్లీ వైపా..? పార్లమెంట్ వైపా..? అనేది స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది..పూర్తి వివరాల్లోకి వెళ్తే

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి.. వైఎస్ఆర్ కుమార్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని ఎమ్మెల్యేలు సంతకాలు చేసి అధిష్టానానికి లేఖ రాసిన పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ ని జగన్ దిక్కరించే స్థాయి వరకు వచ్చింది.. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.ఈ పార్టీకి రాష్ట్రంలో ఎవరు ఊహించని అనూహ్య స్పందన లభించింది. వేలాధి మంది నాయకులు, కార్యకర్తలు జగన్ కు అండగా నిలుస్తూ ఆ పార్టీలో చేరారు.  దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కక్ష్యసాధింపుకు దిగింది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటికి తుమ్మల..?

కొన్ని అక్రమాలు జరిగినట్లుగా నిర్థారించిన సీబీసీఐడీ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతటితో జగన్ మోహన్ రెడ్డి కథ ముగుస్తుందని అనుకున్నారు. కానీ అన్నకు దగ్గ చెల్లెలు అన్నట్లుగా అప్పటి వరకు రాజకీయ ఓనమాలు ఎరుగని వైఎస్ఆర్ తనయురాలు వైఎస్ షర్మిళ తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలిచింది. అన్న బాధ్యతలను బుజాన వేసుకున్న వైఎస్ షర్మిళ అన్న స్థాపించిన  పార్టీని బుజానవేసుకుని నడిపించారు. ప్రపంచ చరిత్రలోనే ఏ మహిళా నాయకురాలు చేయని సాహాసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి, పార్టీని నమ్ముకున్నవారందరికి భరోసాగా నిలిచింది. ఆ తరువాత సోదరుడు జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తరువాత కూడా అన్నతో కలిసి బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంది.  2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించింది.. వాస్తవంగా 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిందంటే అది వైఎస్ షర్మిళ చేసిన పాదయాత్ర పుణ్య ఫలితమేనని బహిరంగంగానే చెప్పవచ్చు. కానీ ఆ ప్రభుత్వంలో వైఎస్ షర్మిల ప్రజాప్రతినిధి కాలేదు. కనీసం నామినేటేడ్, పార్టీ పదవిని కూడా పొందలేకపోయారు.

== తెలంగాణ రాజకీయాల్లోకి

వైఎస్ షర్మిళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని సంకల్పించారు. అందులో భాగంగానే 2021 సంవత్సరంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ వేదికగా పార్టీని స్థాపించారు. భారీ బహిరంగ సభను నిర్వహించిన ఆమె పార్టీ జెండా, ఏజెండాను ప్రకటించి, ఆ తరువాత సెప్టెంబర్ 2న పార్టీ జెండాను అవిష్కరించారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించింది. చాలామంది ఆగ్రనాయకులు షర్మిళతో నడిచారు. వైఎస్ షర్మిళ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వంపై మండిపడుతూనే ఉన్నారు. నిరుద్యోగ సమస్యపై, యువత సమస్యలపై, రైతుల కోసం అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వైఎస్ షర్మిళను అనేక ధఫాలుగా అరెస్ట్ లు చేయడం జరిగింది.

ఇది కూడా చదవండి: జలగం దారేటు..?

మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిళ తీవ్ర పదజాలంతో విమ్మర్శలు చేయడంతో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడైతే షర్మిళ జైలుకు వెళ్లిందో..? పార్టీ పరిస్థితి తెలంగాణలో దయనీయంగా మారింది..  పార్టీని నడిపించే అవకాశాలపై అదుష్టం నీళ్లు జల్లినట్లైంది.. దీంతో కాలక్రమేనా వైఎస్ షర్మిళ పార్టీలోకి వలసలు తగ్గాయి. సీనియర్ నాయకులు, ముఖ్యనాయకత్వం పార్టీ వైపు చూడటం లేదు. మీటింగ్ లకు హాజరువుతున్న జనం పార్టీలో చేరే విషయంలో వెనకడుగు వేస్తున్నారు.

== పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రమాణం

వైఎస్ షర్మిళ రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ కరుణగిరి సమీపంలో పార్టీ కార్యాలయం, ఇళ్లు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అందుకు స్థలాన్ని నిర్ణయించి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆమె పాలేరు ప్రజల సాక్షిగా, పాలేరు మట్టి సాక్షిగా పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని మాటిచ్చారు. పాలేరు బిడ్డగా అడుగుతున్న ఆశీర్వదించాలని కోరారు. ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అందుకు గాను పాలేరు నియోజకవర్గంలో సర్వే చేయించగా, కొంత పర్శంటేజీ మాత్రమే గెలుపుకు అవకాశాలు రావడంతో ఆమె డైనమాలో పడినట్లు తెలుస్తోంది.

== కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిళ

వైఎస్ షర్మిళ కాంగ్రెస్ గూటిలో చేరేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు ఆమె గత రెండు రోజులక్రితం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను  ఢిల్లీలోని వారి స్వగ్రామంలో కలిసి పార్టీలో చేరే విషయంపై చర్చించారు. దీంతో సోనియా, రాహుల్ గాంధీలతో జరిగిన చర్చలు సఫలమైయ్యాయి. కాగా పార్టీని విలీనం చేయాలని వారు షర్మిళను అడిగగా, ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది.. సీట్ల విషయంలో కొన్ని డిమాండ్లను అధినేత్రి వద్ద ఉంచగా, వాటిని పరిశీలిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.. కాగా వైఎస్ షర్మిళ మీడియాకు కూడా ఇదే విషయాన్ని చెప్పంది. అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లి తండ్రి సమాది వద్ద నివాళ్లు అర్పించి తండ్రి ఆశీస్సులను అందుకుంది.

== త్వరలో ప్రియాంకగాంధీ సమక్షంలో

ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకగాంధీ అతి త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 15 లేదంటే 23న తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రియాంకగాంధీ నేరుగా

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించిన వైఎస్ షర్మిళ నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ వైఎస్ఆర్ సతిమణి వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడనున్నారు. అదే రోజున వైఎస్ షర్మిళ, వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుని, వైఎస్ఆర్ టీపీ పార్టీని విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది.

== ఖమ్మం ఎంపీగా షర్మిళా

పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని మట్టి సాక్షిగా చెప్పిన వైఎస్ షర్మిళ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.. ఇటీవలే ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిళ సీట్ల విషయంలో చర్చించగా, పాలేరుతో పాటు మరో మూడు స్థానాలను అడిగినట్లు తెలుస్తోంది. కాగా ఏపీ  రాజకీయ వ్యవహరాలను చూసుకోవాలని, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తామని, సోనియా సూచించినట్లు సమాచారం. దీంతో వైఎస్ షర్మిళా ప్రస్తుతం తెలంగాణలోనే ఉంటానని చెప్పగా, సికింద్రాబాద్ తో పాటు ఒక రిజర్వేషన్ కల్గిన సీటును ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. పాలేరు ఇవ్వకపోతే నేను సూచించిన అభ్యర్థికి ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. పరిశీలిస్తామని సోనియాగాంధీ చెప్పడంతో సంతోషంతో వెనుదిరిగిన వైఎస్ షర్మిళ  తెలంగాణ వచ్చిన అనంతరం కొంత మంది సీనియర్ రాజకీయ నేతల సలహా మేరకు ఖమ్మం ఎంపీగా వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఇదే విషయాన్ని సోనియాగాంధీకి తెలియజేయగా ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎస్సీ, ఎస్టీలలో రిజర్వుడ్ సీటు ఎక్కడ నుంచి అడగాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరించిన వైఎస్ షర్మిళకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.?