Telugu News

పాలేరు ప్రజలకు ‘షర్మిళ’ బంపర్ ఆఫర్

ప్రజాకర్షణ పథకాలు ఫార్ట్ -2

0

పాలేరు ప్రజలకు ‘షర్మిళ’ బంపర్ ఆఫర్

== ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్న షర్మిళ

== మృతుల కుటుంబానికి రూ.25వేలు

== ప్రతి మండలానికో అంబులెన్స్..

== గర్భిణి అయితే రూ.10వేలు..ఆడబిడ్డ పుడితే రూ.15వేలు

== ఆడబిడ్డకు పెళ్లైతే రూ.1లక్ష

== ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే రూ.10వేలు

== అతి త్వరలో మరిన్ని పథకాలు

== స్వంత డబ్బులను నియోజకవర్గ ప్రజలకు కేటాయించనున్న షర్మిళ

== ఈనెల 21 పాలేరు పర్యటించనున్న షర్మిళ..అదే రోజు ముఖ్యనేతలతో సమావేశం

(పెండ్ర అంజయ్య,కూసుమంచి- విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పాలేరు నియోజకర్గంలో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.. జనరల్ స్థానమైన పాలేరులో పోటీ చేసేందుకు బడా బాబులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని పార్టీలకు అధ్యక్షులుగా ఉన్న నాయకులు పాలేరు వైపు చూస్తుండగా.. మరికొంత మంది నాయకులు పాలేరు వైపు చూస్తున్నారు.. అందులో భాగంగానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ కూడా పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో ఆమె పార్టీ కార్యకర్తలు, నాయకులు లేరు. వైఎస్ఆర్ అభిమానులు మినహా ప్రత్యేకంగా ఆ పార్టీకి క్యాడర్ లేదు. ఆమె ను నడిపించే నాయకుడు లేడు.

ఇది కూడా చదవండి: రాబోవు కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం..: పొంగులేటి

గ్రామాల్లో పట్టుమని పదిమంది కార్యకర్తలు లేరు.  ఈ క్రమంలో పాలేరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్న షర్మిళ.. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఆమె ఇప్పటికే ఎవరు ఊహించని విధంగా పాలేరు నియోజకవర్గంలోనే స్థానికంగా ఉండాలని నిర్ణయించి ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి వద్ద రెండేకరాల ఖాళీ స్థలంలో ఇంటిని నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తరువాత ఆమె అమెరికా వెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఆమె తన వ్యక్తిగత అనుచరుడ్ని నియమించి, ఆయనకు దశదిశ నిర్దేశం చేసి, ఆమె కొన్ని ప్రజలకు చేయూత చేసే కార్యక్రమాలను అప్పగించి వెళ్లారు. తిరిగి ఆమె ఈనెల 21న పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె రావడంతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రజాకర్షణ పథకాలను(వ్యక్తిగత సహాయం) ఆమె ప్రకటించి, ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ఇప్పటికే అందులో కొన్ని పథకాలను ఆమె అమలు చేస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా ఆమె చేయూత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

== మానిఫెస్టో ఆదుర్స్

వైఎస్ షర్మిళ పాలేరు ప్రజలను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలేరు నియోజకవర్గం నా అడ్డా అని ప్రకటించిన ఆమె ప్రజలను కూడా స్వంత వారిగా చూడాలని నిర్ణయించుకున్నారు. అందుకే ప్రజలకు చేయూతనందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందుకు గాను రాబోయే ఎన్నికల వరకు కొత్త ప్రజాకర్షణ పథకాలను(వ్యక్తిగత సహాయం) అందించేందుకు ఒక మానిఫెస్టోను తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మానిఫెస్టో తెలుసుకుంటే అబ్బో మైండ్ బ్లాక్ కావడం ఖాయం.. ప్రజలందరు అదిరిపోయే, నాయకులు బెదిరిపోయే పథకాలను అమె అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.. నియోజకవర్గంలో ప్రస్తుతం చనిపోయిన కుటుంబాన్ని రూ.25వేలను అర్థిక చేయూతనందించడం,

ఇది కూడా చదవండి: ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ.10వేల ఆర్థిక చేయూత, ప్రమాదంలో వికలాంగులైనవారికి రూ.50వేలు, ఆరోగ్యం బాలేక ఆసుపత్రి పాలైన రూ.10వేలు, ఆడబిడ్డకు పెళ్లైతే రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు, ఆడబిడ్డ గర్భిణి అయితే రూ.10వేలు, ఆడబిడ్డ పుడితే రూ.15వేలు, ఆ ఆడబిడ్డకు ఉచితంగా చదువులు చెప్పించడం,  మండలంలోని అద్భుతంగా చదువుతున్న వారిని ప్రోత్సహించేందుకు మండల పస్ట్, జిల్లా పస్ట్, సెకండ్ వచ్చిన వారికి అర్థిక చేయూత, ఆపై చదువులుకు అర్థిక చేయూత లాంటి స్వంత ఖర్చులతో ప్రజలకు అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేనా..? మండలానికో అంబులెన్స్..నియోజకవర్గానికి కార్పోరేట్ వలే ఒక అద్భుతమైన ఆసుపత్రి నిర్మాణం..?అందులో అందరికి ఉచితవైద్యం..? అబ్బో ఇలాంటివి ఎన్నో.. ఎన్నో ప్రజాఅకర్షణ పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..?

== నాయకులకు బంఫర్ ఆపర్

ప్రజల కోసం పథకాలను అందించేందుకు సిద్దమైన షర్మిళ,  వైఎస్ఆర్ టీపీలోకి వచ్చే ఇతర పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు కూడా బంఫర్ ఆపర్ ఇస్తున్నట్ల తెలుస్తోంది.. సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులతో పాటు బలమైన నాయకుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు మారిన వారికి కూడా బంఫర్ ఆపర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదేంత వరకు నిజమో కానీ.బయట మాత్రం విఫరితంగా ప్రచారం జరుగుతోంది..

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ రేసులో మరో ఇద్దరు..?

అయితే వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు నియోజకవర్గంలో ఉన్నకీలక నాయకులు, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నయానో, బయానో ఇచ్చి పార్టీలో చేర్పించేందుకు మాత్రం చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. అంతే కాకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన, ఎమ్మెల్యే అయిన తరువాత వచ్చే కాంట్రాక్ట్ వర్కులు కొందరికి, సర్పంచ్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధుల స్వంతఖర్చులతో గెలిపిస్తామని హామినిస్తున్నట్లు సమాచారం.

== ఈనెల 21న పాలేరులో పర్యటన

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఈనెల 21న పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవలే పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం కొద్ది రోజుల క్రితం విదేశి పర్యటనకు వెళ్లారు. అనంతరం ఈనెల 16న తెలంగాణకు వచ్చిన అనంతరం ఈనెల 21న పాలేరు నియోజకవర్గంలో పర్యటించి, ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి

అదే రోజున క్యాంఫ్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అర్థిక చేయూత, పార్టీలో చేరికలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీలో పంపకాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు నుంచి ఎన్నికల వరకు ఒక రకమైన మానిఫెస్టో తయారు చేసి అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి పాలేరు నియోజకవర్గంలో వైఎస్ షర్మిళ ఒక ట్రెండ్ స్రుష్టిస్తున్నట్లే తెలుస్తోంది.