Telugu News

షర్మిళ..విలీనామా..? విహారమా..?

షర్మిళ దారేటు..? నేతల రూటేటు..?

0

షర్మిళ..విలీనామా..? విహారమా..?

== ఎమ్మెల్యేకా..? ఎంపీకా..?

== షర్మిళ దారేటు..? నేతల రూటేటు..?

== అధిష్టానంతో అధినేత్రి  చర్చలు

== దేశరాజదానిలోనే మకాం.. మంకుపట్టు వీడని షర్మిళ

== ఆ సీటుకైతే తిరుగేలేదంటున్న జిల్లా ప్రజలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఆమె ఒక ఫైర్ బ్రాండ్.. ఎవడైతే నాకేంటి..? జరిగింది అడిగేసి..కడిగిందే కడిగేసి ప్రశ్నించే లేడి సింగం ఆమె.. అన్న కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆరు నెలల పాటు విరామం లేకుండా పాదయాత్ర చేసిన ఆమె.. అన్నకు అధికారం వచ్చిన తరువాత.. అన్న స్థాయిలో రాజకీయాలు చేయాలనే సంకల్పబలంతో తెలంగాణకు వచ్చింది ఆమె. ఇక్కడే పుట్టా..? ఇక్కడే పెరిగా..? నేను తెలంగాణ బిడ్డను.. రాజన్న బిడ్డను అంటూ జనం గుండెల్లోకి చేరువైన ఆమె అతి చిన్నవయస్సులోనే పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలినడకన చుట్టేసింది. ఏ సెంటర్ కు వెళ్లి.. ఏ జిల్లాకు వెళ్లిన అధికార పార్టీ నేతలను, అధికార అమాత్యులను కడిగేసింది.. అడుగడుగున నిరసనలతో హాట్ టాఫిక్ పొలిటికల్ లీడర్ గా ఎదిగింది.. ప్రజాప్రతినిధులపై విరుచకపడింది.. తప్పుడు నిర్ణయాల పట్ల ప్రశ్నల వర్షం కురిపించింది.. అక్కడ, ఇక్కడ ప్రభుత్వాలను కడిగేసింది.. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని భరోసానిచ్చింది.. అద్భుత స్పీచ్ తో, మొండి దైర్యంతో ప్రజల్లోకి వెళ్లింది.. పోరాటం చేస్తూ జైలుకు వెళ్లింది.. వెళ్లిపోతుందనుకున్న ఆమె గోడకు కొట్టిన బంతి వలే తిరిగి ప్రజల చేంతకు చేరింది..ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉద్రుత్తం చేసింది.. ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా..? ఐరెన్ లేడి.. ఆడపులి.. వైఎస్ షర్మిళ గురించే… అలాంటి లీడర్   తాను స్థాపించిన పార్టీని తల్లిపార్టీలో కలిపేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.. అందుకోసం అధిషానంను కలిసేందుకు రాజదానిలో తిష్టా వేసింది.. బిజినెస్ పార్టనర్ లతో కలిసి ఢిల్లీలో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.. అయితే ఆమె వీలనం చేస్తుందా..? ఆ పార్టీతో విహారం చేస్తుందా..? ఎవరికి అంతుపట్టని ప్రశ్నగా మారింది.. ఇన్ని కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన నేను పార్టీని విలీనం ఎందుకు చేస్తా..? అని మీడియాముందు చెబుతున్నప్పటికి అధిష్టానం వద్ద మాత్రం వీలనం పల్లవి అందుకుంటున్నట్లు తెలుస్తోంది.. అసలు విలీనం అవుతుందా..? విహారం చేస్తుందా..? ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందా..? ఎంపీకి వెళ్తుందా..? ఆమె దారేటు..? అనుచరుల రూటే ఎటు..?  ఇదంతా తెలుసుకోవాలంటే..? విజయం పత్రిక ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం మీరందరు చదవాల్సిందే..? మరిన్ని వివరాలు ఈ కింది లింక్ ను క్లిక్ చేసి పూర్తిగా చదవండి: 

ఇది కూడా చదవండి:వైఎస్ షర్మిళ దారేటు..? నేతల రూటేటు..?