Telugu News

దమ్మపేట మండలం లో మూడవ రోజు పాదయాత్రలో షర్మిల.

నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలి.

0

దమ్మపేట మండలం లో మూడవ రోజు పాదయాత్రలో షర్మిల.

–నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలి.

—నిరుద్యోగులకు 3000 భృతిని చెల్లించాలి.

(దమ్మపేట విజయం న్యూస్):-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో 3 వ రోజు పాదయాత్ర కొనసాగించుకున్నా షర్మిల. ఘనంగా నిర్వహించిన పాదయాత్రలో మంగళవారం అప్పారావుపేట గ్రామంలో రైతులతో మాట్లాడటం జాతిగింది. వారికి వచ్చిన నష్టం గురించి అడిగి తెలుసుకుని కన్నీరు పెట్టుకుంది. అప్పరావుపేట రైతులు షర్మిలను కలిసి మొన్న వచ్చిన వర్షానికి వరి పంట మొత్తం కొట్టుకుపోతుందని, చేతికి వచ్చిన పంట నాశనం అయిందని, ఎమ్మెల్యేకి చెప్పుకున్న ఎలాంటి న్యాయం చేయలేదని రైతుల బాధలను షర్మిలతో పంచుకున్నారు.

also read;-స్వరాష్ట్రంలోనే లింగాయత్‌లకు ప్రాధాన్యం

రైతుల న్యాయం కోసం ఎంత దూరం అయిన వెళ్తాను అని, రైతు లేనిదే దేశం లేదని, రైతులకు అన్యాయం చేస్తే పుట్టగతులు ఉండవు అని కేసీఆర్ పై మండిపడింది. దేశ అన్నదాత అయినా రైతులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి పదవి కెసిఆర్ కి దండగ అని రైతులతో షర్మిల ఆవేదన వ్యక్తం చేసింది. అప్పారావుపేట కొనసాగుతున్న షర్మిల నిరాహార దీక్ష లో యువతకు స్వయం ఉపాధి లోన్స్ వెంటనే అందించాలని, నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతిని చెల్లించాలి అని, పేద నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే ఉచిత కోచింగ్ ఇవ్వాలని, 80 వేల ఉద్యోగాలు కాదు అని లక్షా తొంభై ఒక ఉద్యోగాలు ఇవ్వాలని, నోటి మాటలు కాదు ఉద్యోగాలు ఇవ్వాలని షర్మిల ఘనంగా నిరాహార దీక్ష కొనసాగిస్తుంది.